పెళ్లి చేసుకున్న హీరోయిన్-మాజీ ఎంపీ | Actress Mimi Chakraborty Marriage | Sakshi
Sakshi News home page

Mimi Chakraborty: హీరోయిన్ రిజిస్టర్ మ్యారేజ్.. ఫొటోలు వైరల్

Nov 27 2026 12:05 AM | Updated on Nov 27 2026 12:05 AM

Actress Mimi Chakraborty Marriage

బెంగాలీ హీరోయిన్, మాజీ ఎంపీ మిమీ చక్రవర్తి పెళ్లి చేసుకుంది. గత 18 ఏళ్లుగా సీరియల్స్, సినిమాలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న ఈమె.. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది. గురువారం ఈ వేడుక జరగ్గా దీని ఫొటోలని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. అయితే భర్త ఎవరనేది బయటపెట్టలేదు.

అయితే మిమీ చక్రవర్తి.. మెరైన్ ఇంజినీర్ అయిన సిద్ధార్థ దత్తాని పెళ్లి చేసుకుందని వార్తలొస్తున్నాయి. 2008లో సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించిన మిమీ.. 2012 నుంచి సినిమాల్లో చేస్తోంది. ఎక్కువగా బెంగాలీ చిత్రాల్లోనే నటించింది. హిందీతో పాటు బంగ్లాదేశీ మూవీలోనూ హీరోయిన్‌గా చేసింది.

37 ఏళ్ల ఈమె ఇప్పుడు సడన్‌గా తనకు పెళ్లయిన సంగతి బయటపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. నటిగా సుపరిచితురాలైన ఈమె.. 2019లో లోక్‌సభ ఎన్నికల్లో జాదవ్‌పుర్ స్థానానికిగానూ తృణమూల్ కాంగ్రెస్ తరఫున ఎంపీగా పోటీ చేసి విజయం సాధించింది. ఈసారి ఎలక్షన్లలో నిలబడలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement