మనీష్, పాయల్ ముఖర్జీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘రెటీనా’. ఈ చిత్రానికి డైరెక్టర్ అల్లం రాజు. పార్వతి సినిమాస్ బ్యానర్ పై నిర్మాత పార్వతి నిర్మిస్తున్నారు. హర్ష ప్రవీణ్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా పోస్టర్, సాంగ్ లాంఛ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
డైరెక్టర్ అల్లం రాజు మాట్లాడుతూ .. ‘మంచి ఎమోషన్స్ తో సాగే చిత్రమిది. రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ స్ఫూర్తిగా తీసుకుని తెరకెక్కించాం. మా టీమ్ అంతా సినిమా కోసం బాగా సపోర్ట్ చేశారు. హర్ష ప్రవీణ్ మ్యూజిక్ హైలైట్ అవుతుంది’ అని అన్నారు.
(ఇదీ చదవండి: వీడు నటించగలడు అని నమ్మింది నానినే : నితిన్)


