చూపునిచ్చే మంచి వైరస్‌..! | Health Tips: eno-Associated Virus as a Vector for Gene Therapy | Sakshi
Sakshi News home page

రెటినైటిస్‌ పిగ్మెంటోసా పేషెంట్స్‌కు... ! చూపునిచ్చే మంచి వైరస్‌..

Nov 22 2026 11:13 AM | Updated on Nov 22 2026 11:34 AM

Health Tips: eno-Associated Virus as a Vector for Gene Therapy

అడినో అసోసియేట్‌ వైరస్‌ అనే ఓ వైరస్‌లోని సొంత జన్యువులను తొలగించి, దాన్ని ఒక వాహకంగా (వెక్టార్‌గా) మారస్తున్నారు. ఆ వైరస్‌ ద్వారా సరిగ్గా పనిచేసే జన్యువును కంటిలోని రెటీనా కణాల్లోకి చేరవేసి, ఈ విధానంతో కొన్ని వంశపారంపర్య రెటీనా వ్యాధుల కారణంగా చూపు కోల్పోతున్న కొందరిలో చూపు మెరుగుపడేలా చేస్తున్నారు. 

సాధారణంగా రెటినైటిస్‌ పిగ్మెంటోసా వ్యాధి చికిత్సలో వ్యాధి లక్షణాలను తగ్గించడం, మిగిలి ఉన్న ఆ కొద్దిచూపును కాపాడటంపైనే డాక్టర్లు దృష్టి పెడతుంటారు. కానీ జీన్‌  థెరపీ మాత్రం వ్యాధికి మూలమైన జన్యుపరమైన లోపాన్ని సరిచేయడానికి లేదా ఆ లోపాన్ని రిపేరు చేయడం ద్వారా ఆ వ్యాధి ప్రభావాన్ని అధిగమించడానికి ప్రయత్నిస్తుంది. ఈ చికిత్స ఎలా పనిచేస్తుందంటే...  శాస్త్రవేత్తలు అడినో అసోసియేట్‌ వైరస్‌ (ఏవీవీ) అని పిలిచే ప్రత్యేకంగా మార్పులు చేసిన ఓ వైరస్‌ను ఓవాహకంగా ఉపయోగిస్తున్నారు.

సాధారణ వైరస్‌లు మన కణాల్లోకి ప్రవేశించి తమ ప్రతిరూపాలను తయారు చేస్తూ పెరిగి΄ోతాయి. వీటినే కాపీలను తయారు చేసుకోవడంగా చెబుతుంటారు. దీన్నే రిప్లికేషన్‌ అని కూడా అంటారు. అయితే చికిత్సలో ఉపయోగించే అడినో అసోసియేట్‌ వైరస్‌ల వెక్టర్లకు అలా తమ సంఖ్యను పెంచుకునే సామర్థ్యం ఉండదు. ఫలితంగా ఇవి వ్యాధిని కూడా కలిగించవు. పనిచేసే జన్యువును ఈ వైరస్‌ వెక్టర్‌లో ఉంచుతారు. అది ఆ జన్యువును రెటీనాలో ఇంకా జీవించి ఉన్న కణాల్లోకి చేరవేస్తుంది. 

రెటినైటిస్‌ పిగ్మెంటోసా అంటే ఏమిటి? 
రెటినైటిస్‌ పిగ్మెంటోసా (ఆర్‌పీ) అనేది వంశపారంపర్యంగా వచ్చే కొన్ని కంటి వ్యాధుల సమూహం. ఇందులో కంటిలోని రెటీనాలో ఉండే కాంతిని గుర్తించే కణాలు (ఫొటో రిసె΄్టార్స్‌) క్రమంగా క్షీణిస్తాయి. ఇవి రాడ్స్, కోన్‌ అని రెండు రకాలుగా ఉంటాయి. సాధారణంగా మొదట రాడ్స్‌  కణాలు దెబ్బతింటాయి. దాంతో రాత్రిపూట చూపు తగ్గుతుంది. ఆ తర్వాత క్రమంగా పక్కలకు కనిపించే  చూపు పరిధి (విజువల్‌ ఫీల్డ్‌) తగ్గి΄ోతుంది. వ్యాధి మరింత ముదిరితే మధ్యభాగంలో కనిపించే చూపు (సెంట్రల్‌ విజన్‌) కూడా దెబ్బతినవచ్చు. వ్యాధికి కారణమైన జన్యులోపాన్ని బట్టి జీన్‌థెరపీ అందిస్తారు. 

మొదటి విధానం: ఇప్పటికే అనుమతి పొందిన ఆర్‌పీఈ–65 జీన్‌  థెరపీ... రెటినైటిస్‌ పిగ్మెంటోసా వ్యాధికి 100కు పైగా జన్యువుల్లో వచ్చే లోపాలు కారణం కావచ్చు. అయితే ప్రస్తుతం ఆమోదం పొందిన వొరెటిజీన్‌ నెపర్వోవెక్‌ (లక్స్‌టర్నా) అనే ‘జీన్‌  థెరపీ’ మాత్రం ఆర్‌పీఈ–65 అనే నిర్దిష్ట జన్యువులో లోపం ఉన్నవారికే ఉపయోగపడుతుంది. ఈ వ్యాధి ఆటోసోమల్‌ రిసెసివ్‌ పద్ధతిలో సంక్రమిస్తుంది. 

అంటే తల్లి నుంచి ఒకటి, తండ్రి నుంచి మరొకటి వచ్చే... ఈ ‘ఆర్‌పీఈ–65’ జన్యువు రెండు కాపీలలోనూ వ్యాధికి కారణమయ్యే లోపం ఉండాలి. ఈ చికిత్సలో అడినో అసోసియేట్‌ వైరస్‌ టైప్‌–2 అనే వైరస్‌ వెక్టర్‌ ద్వారా సరిగ్గా పనిచేసే ‘ఆర్‌పీఈ–65’ జన్యువును కంటిలోని రెటీనా పిగ్మెంట్‌ ఎపిథీలియం కణాల్లోకి పంపిస్తారు. దీనికోసం విట్రెక్టమీఅనే శస్త్రచికిత్స ప్రక్రియ తర్వాత రెటీనా కింద (సబ్‌ రెటినల్‌) ఓ ప్రత్యేక ఇంజెక్షన్‌  ఇస్తారు. 

‘ఆర్‌పీఈ–65’ అనే జన్యువు తయారు చేసే ప్రోటీన్‌  ఒక ఎంజైమ్‌. ఇది కంటిలో కాంతిని గుర్తించే ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తుంది. కాంతిని గుర్తించడానికి అవసరమైన పదార్థాన్ని తిరిగి తయారుచేయడంలో ఇది సహాయపడుతుంది. ఈ జన్యువును తిరిగి అందించడంతో ఇంకా జీవించి ఉన్న ఫొటో రిసె΄్టార్‌ కణాలు తమ పనిని మెరుగ్గా చేయగలుగుతాయి.

రెండో విధానం: ఆప్టోజెనెటిక్‌ చికిత్స
రెటినైటిస్‌ పిగ్మెంటోసా (ఆర్‌పీ) వ్యాధి బాగా ముదిరినప్పుడు కాంతిని గుర్తించే ఫొటో రిసెప్టార్‌  కణాలు చాలా వరకు నశించి΄ోవచ్చు. అయినప్పటికీ రెటీనాలోని బైపోలార్, గ్యాంగ్లియాన్‌  వంటి మరికొన్ని కణాలు ఇంకా జీవించి ఉండవచ్చు.

ఆప్టోజెనెటిక్‌ చికిత్సలో కాంతికి స్పందించే ప్రత్యేకమైన ప్రోటీన్‌ (ఆప్సిన్‌) తయారుచేసే జన్యువును ఈ మిగిలి ఉన్న కణాల్లోకి పంపిస్తారు. సాధారణంగా దీనికోసం కంటిలోకి ఇంజెక్షన్‌  (ఇంట్రా విట్రియల్‌ ఇంజెక్షన్‌) ఇస్తారు. దాంతో ఆ కణాలు కాంతికి స్పందించే సామర్థ్యాన్ని పొదుతాయి. అవి కాంతికి స్పందించినప్పుడు ఏర్పడే సంకేతాలు మెదడుకు చేరతాయి. ఇలా చూపును కొంతవరకు తిరిగి మెరుగుపరచాలన్నదే ఈ చికిత్స లక్ష్యం.

అయితే ఈ రెండు చికిత్సా విధానాలూ ఇప్పటికే చనిపోయిన ఫొటోరిసెప్టార్‌ కణాలను తిరిగి పుట్టించలేవు. ముఖ్యంగా ఆప్టోజెనెటిక్స్‌లో... రెటీనాలో మిగిలి ఉన్న ఇతర కణాలకు, కాంతిని గుర్తించే కణాల పనిలో కొంత భాగాన్ని చేపట్టే కొత్త సామర్థ్యాన్ని కల్పిస్తారు.
ఇప్పటివరకు గుర్తించిన ప్రయోజనాలు

తగిన అర్హత ఉన్న కొందరు రెటినైటిస్‌ పిగ్మెంటోసా పేషెంట్స్‌లో ఈ చికిత్సల వల్ల కొన్ని ప్రయోజనాలు కలగవచ్చు.

తక్కువ వెలుతురులో చూడగలిగే సామర్థ్యం మెరుగుపడవచ్చు. 

చీకట్లో నడవడం, వస్తువులను గుర్తించడం కొంత సులభం కావచ్చు.  

∙కాంతిని గుర్తించే సామర్థ్యం, చూపు పరిధి కొంత మెరుగుపడవచ్చు.

ఈ పరిశోధనలో మన దేశం భూమిక కూడా... 
ఈ పరిశోధనలో భారత్‌కు కూడా ఒక ప్రత్యేకమైన భూమిక ఉంది. న్యానోస్కోప్‌ థెర΄ాటిక్స్‌ సంస్థ అభివృద్ధి చేస్తున్న ఆ΄్టోజెనెటిక్‌ చికిత్సకు సంబంధించిన క్లినికల్‌ ట్రయల్స్‌ను ఒడిశాలోని కటక్‌లో ఉన్న జేపీఎమ్‌ రోటరీ క్లబ్‌ ఆఫ్‌ కటక్‌ ఐ హాస్పిటల్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో నిర్వహించారు. ఈ పరిశోధనలో ఎనిమిది మందిలో ఐదుగురికి చూపులో గణనీయమైన  మెరుగుదల కనిపించినట్లు తేలింది. 

చివరగా... ఇప్పటివరకు రెటినైటిస్‌ పిగ్మెంటోసా కారణంగా చూపు కోల్పోతున్నవారికి ప్రత్యేకమైన కళ్లద్దాలు, తక్కువ చూపుతోనే పనులు చేసుకునేలా శిక్షణ, కౌన్సెలింగ్‌ వంటి పద్ధతులే అందుబాటులో ఉన్నాయి. అయితే జీన్‌  థెరపీ ఇప్పుడు కొంతమంది పేషెంట్స్‌లో మిగిలి ఉన్న చూపును కాపాడటానికి లేదా మెరుగుపరచడానికి కొత్త ఆశలు కల్పిస్తోంది.

ఇది నిజంగా అబ్బురం కలిగించే ఓ అద్భుత పరిశోధన. సాధారణంగా వైరస్‌లంటే మనం భయపడతాం. ఎందుకంటే అవి మన శరీరంలోని కణాల్లోకి ప్రవేశించి వేగంగా తమ సంఖ్యను పెంచుకుంటాయి. అందుకే ఏదైనా వేగంగా వ్యాపిస్తుంటే దాన్ని ‘వైరల్‌’ అని కూడా అంటుంటాం. కానీ అలాంటి వైరస్‌లలో హానికరం కాని ఓ వైరస్‌ను ఉపయోగించి కొన్ని రకాల రెటినైటిస్‌ పిగ్మెంటోసా (ఆర్‌పీ) అనే వ్యాధి చికిత్స చేస్తున్నారు. జీన్‌థెరపీ ప్రక్రియ ద్వారా చేస్తున్న ఈ చికిత్స మంచి ఫలితాలు చూపిస్తోంది. వంశపారంపర్యంగా వచ్చే రెటీనా వ్యాధులతో బాధపడే కొందరిలో ఈ సరికొత్త ప్రక్రియ కొత్త ఆశలు కల్పిస్తోంది. ఆ వివరాలివి...

డా.రవి కుమార్‌ రెడ్డి
సీనియర్‌ కంటి 
వైద్య నిపుణులు 

నిర్వహణ: యాసీన్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement