ఏక్యూఐ ఎంత ఉంటే ప్రమాదం? ఎలా నిర్ణయిస్తారు.. | Health Tips: What Air Quality Index level does it become dangerou | Sakshi
Sakshi News home page

ఏక్యూఐ ఎంత ఉంటే ప్రమాదం? ఎలా నిర్ణయిస్తారు..

Nov 17 2026 2:01 PM | Updated on Nov 17 2026 2:01 PM

Health Tips: What Air Quality Index level does it become dangerou

గాలిలో కాలుష్యం ఎంత ఉందో తెలుసుకోవడానికి ఉపయోగించే సూచికే ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ (ఏక్యూఐ). పీఎమ్‌2.5, పీఎమ్‌10, నైట్రోజన్‌ డయాక్సైడ్, సల్ఫర్‌ డయాక్సైడ్, కార్బన్‌  మోనాక్సైడ్, ఓజోన్‌  వంటి కాలుష్య కారకాల మోతాదులన్నింటినీ కలిపి పరిశీలించి ఈ సూచికను లెక్కిస్తారు. వీటిలో అత్యధిక కాలుష్యాన్ని సూచించే అంశం ఆధారంగా మొత్తం ఏక్యూఐని నిర్ణయిస్తారు. భారతదేశంలో సెంట్రల్‌ పొల్యూషన్‌  కంట్రోల్‌ బోర్డు (సీపీసీబీ) అనుసరించే ఏక్యూ వర్గీకరణ ఇలా ఉంటుంది.

0–50: గుడ్‌ – గాలి నాణ్యత బాగుంటుంది. ఆరోగ్యపరమైన ముప్పు చాలా తక్కువ.

51–100: సాటిస్‌ఫ్యాక్టరీ – సాధారణంగా ఫర్వాలేదు. అయితే సున్నితమైన వ్యక్తుల్లో కొద్దిగా  శ్వాస ఇబ్బందులు కలగవచ్చు.

101–200: మోడరేట్‌ (ఓ మోస్తరుగా) – ఊపిరితిత్తుల సమస్యలున్నవారు, పిల్లలు, వృద్ధుల్లో శ్వాస సంబంధిత ఇబ్బందులు కనిపించవచ్చు.

201–300: పూర్‌ (క్వాలిటీ తక్కువ) – ఎక్కువసేపు ఈ గాలిని పీల్చడం వల్ల చాలామందిలో శ్వాస సమస్యలు రావచ్చు.

301–400: వెరీ పూర్‌ (క్వాలిటీ చాలా తక్కువ) – ఎక్కువకాలం లేదా పదేపదే గురికావడం వల్ల శ్వాసకోశ సమస్యల ముప్పు పెరుగుతుంది.

401–500: సివియర్‌ (క్వాలిటీ చాలా తక్కువగా కావడంతో ప్రతికూల తీవ్రత ఎక్కువ) – ఆరోగ్యవంతులపైనా ప్రభావం చూపవచ్చు. ఇప్పటికే గుండె, ఊపిరితిత్తుల వ్యాధులున్నవారికి తీవ్రమైన ముప్పు ఉంటుంది.

సోషల్‌ మీడియాలో ఏక్యూఐ 400, 500 లేదా 1,000 దాటిందంటూ కనిపించే గణాంకాలను చూసినప్పుడు అవి ఏ దేశపు ప్రమాణాల ప్రకారం ఇచ్చారో, ఏ పరికరం లేదా యాప్‌ నుంచి వచ్చాయో తెలుసుకోవాలి. భారతదేశ అధికారిక జాతీయ ఏక్యూ వర్గీకరణ 0 నుంచి 500 వరకు ఉంటుంది. కాబట్టి వేర్వేరు ప్రమాణాల గణాంకాలను నేరుగా పోల్చకూడదు.

ముఖ్యంగా ఏక్యూఐ 100 దాటగానే అందరికీ ఒకే స్థాయిలో ప్రమాదం మొదలవుతుందని చెప్పలేం. భారతీయ ప్రమాణాల ప్రకారం 101 నుంచి 200 వరకు ఉన్న స్థాయిని ‘మోడరేట్‌’గా పరిగణిస్తారు. ఈ స్థాయిలోనే ఆస్తమా, ఊపిరితిత్తుల వ్యాధులున్నవారు, పిల్లలు, వృద్ధులు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. కాలుష్య స్థాయి పెరిగే కొద్దీ ఆరోగ్యవంతులకూ ముప్పు పెరుగుతుంది.

వ్యక్తిగత జాగ్రత్తలతోపాటు కాలుష్య నియంత్రణ కూడా ముఖ్యం!
మాస్కులు ధరించడం, ఇంట్లోనే ఉండటం, బయట వ్యాయామం తగ్గించడం వంటివి తాత్కాలికంగా కాలుష్యానికి గురికావడాన్ని తగ్గించగలవు. కానీ ఇవే శాశ్వత పరిష్కారాలు కావు. వాహనాల ఉద్గారాలను నియంత్రించడం, పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యాన్ని తగ్గించడం, నిర్మాణ ప్రాంతాల్లో దుమ్ము వ్యాపించకుండా చర్యలు తీసుకోవడం, చెత్తను బహిరంగంగా కాల్చకుండా చూడటం, స్వచ్ఛమైన ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహించడం వంటి చర్యలు అత్యవసరం.

ఈ చలికాలమతా మనం పీల్చే గాలి నాణ్యతను గమనిస్తూ ఉండాలి. ఎందుకంటే గాలి కనిపించక΄ోయినా... అందులోని కాలుష్యం మన ఊపిరితిత్తులపై తన ప్రభావాన్ని చూపుతూనే ఉంటుంది. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే స్వచ్ఛమైన గాలి కూడా మనకు అవసరమైన ్ర΄ాథమిక హక్కు అనే విషయాన్ని గుర్తించాలి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement