వెయిట్‌లాస్ అవ్వడానికి సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు ప్రతి ఒక్కరు ప్రయత్నిస్తున్నారు. అందరూ ఆరోగ్య స్పృహతో స్మార్ట్‌గా మారేందుకు ప్రాముఖ్యత వహిస్తున్నారు. అంతేగాదు ఆరోగ్యవంతంగా బరువు తగ్గే మార్గాల వైపుకే మొగ్గు చూపుతున్నారు. ఈ కోవలోకి తాజాగా వైద్యులు కూడా చేరుతుండటం విశేషం.
ఇటీవల చాలామంది వైద్యులు తమ వర్క్ బిజీ షెడ్యూల్ కారణంగా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడమే గాక పేషెంట్లకు హెల్దీగా ఉండటంపై సూచనలిస్తున్నామని గ్రహిస్తున్నారు. ముందు తాము మార్పుని స్వీకరిస్తే..రోగులకు ఇచ్చే సూచనలకు విలువ ఉంటుందనే దిశగా అడుగులు కదుపుతూ..స్లిమ్‌గా మారుతున్నారు డాక్టర్లు. ఇప్పుడు ఆ జాబితాలోకి తాజాగా ఈ మానిసిక వైద్యుడు కూడా చేరారు. మరి ఆయన వెయిట్‌లాస్ జర్నీ ఎలా సాగిందో చూద్దామా..!.
మానసికి వైద్యుడు, థెరపిస్ట్ డాక్టర్ జి వికాస్ నాయక్ స్వతహాగా 103 కేజీలపైనే బరువు ఉండేవాడు. ఆయన తన రూపంతో చాలా ఇబ్బందులు పడ్తుండేవాడు. స్నేహితులు, కుటుంబ సభ్యుల మాటలకే గాదు..ఒక రకంగా ఆ బరువు రోజువారీ కార్యకలాపాలు చేసుకోనివ్వకుండా ఇబ్బంది పెడుతుండేది. ఇక ఈ అధిక బరువుకి చెప్పకపోతే..ఆరోగ్యం కూడా ‘గోవింద’ అని గ్రహించి వెయిట్ లాస్ అవ్వడానికి ఉపక్రమించాడు.
ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉండేలా కేలరీలు తక్కువగా ఉండేలా ఆహారం తీసుకునేవాడు. అలాగే దీంతోపాటు బరువు తగ్గేలా సమర్థవంతమైన వ్యాయామాలపై ఫోకస్ పెట్టి..నిలకడగా చేసేందుకు ప్రయత్నించాడు. ఆ పట్టుదలే అతడిని చాలా కొద్ది సమయంలోని బరువు తగ్గి స్లిమ్ అయ్యేలా మార్పులకు దారితీసింది. అంతేగాదు తన రూపుని చూసి ఆయనే నమ్మలేకపోయాడు.
అంతలా..ఒక యువకుడి మాదిరిగా అతడి ఆహార్యం, రూపు రేఖలు మారిపోయాయి. అతడి బయలాజికల్ వయసుకంటే తక్కువుగా కనిపించేలా హ్యాండ్‌సమ్‌గా మారిపోయాడు. ఆ సంతోషాన్ని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకుంటూ ..తనలా ఊబకాయంతో బాధపడుతున్న వాళ్లకు స్ఫూర్తిగా మారాడు.
వైద్యులు ఏమంటున్నారంటే..
డైటీషియన్లు, వైద్య నిపుణులు..ఇలా ఏకంగా అన్ని కేజీల బరువుని తగ్గించుకోవడం అంటే..రక్తంలోని గ్లూకోజ్ లెవెల్స్ తోపాటు, రక్తపోటు, ట్రైగ్లిజరైడ్ స్థాయిలతో సహా అనేక జీవక్రియ ఆరోగ్య సూచికలు మెరుగపడ్డాయని అర్థం అని చెబుతున్నారు. ఇది ఒక రకంగా ఊబకాయ సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గించిందని చెప్పొచ్చు. బరువు తగ్గేటప్పుడు కండరాలను కాపాడుకోవడం చాలా ముఖ్యం. తగినంత ప్రోటీన్ తీసుకుంటూ, రెసిస్టెన్స్ ట్రైనింగ్, విశ్రాంతి చాలా ముఖ్యం అని నొక్కి చెబుతున్నారు.
కూరగాయలు, పండ్లు తృణధాన్యాలు, పాల ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇస్తూ సమతుల్య ఆహారం తీసుకుంటే చాలని సూచిస్తున్నారు. అంతేగాదు దీర్ఘకాలిక బరువుని నిర్వహించడంలో వ్యాయామం చాలా ముఖ్యపాత్ర పోషిస్తుందని తెలిపారు. అంతేగాదు బరువు తగ్గడం అనేది ఒక ప్రయాణం మాత్రమే దాన్ని నిలబెట్టుకునేలా స్థిరమైన అలవాట్లు పాటించాలని హెచ్చరిస్తున్నారు.
గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.
ఇదీ చదవండి: రూ. 140లకే ఎయిర్ ప్యూరీఫైయ్యర్!


