గాలి కాలుష్యం రోజురోజుకు పెరిగిపోతుండటంతో.. స్వచ్ఛమైన గాలి పీల్చడం గగనమవుతోంది. ముఖ్యంగా పాఠశాలల్లో చదివే పిల్లలు శుభ్రమైన గాలి లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగని అన్ని తరగతి గదుల్లో ఎయిర్ ఫ్యూరిఫైయ్యర్‌లు అమర్చడం ఖర్చుతో కూడుకున్న పని.
అందువల్ల ఈ సమస్యకు ఒక చక్కని పరిష్కారం చూపించాడు ఢిల్లీలోని సంస్కృతి పాఠశాలలో చదువుతున్న కృష్ణ అగర్వాల్ అనే విద్యార్థి. కృష్ణ అగర్వాల్ తన తోటి విద్యార్థి అయిన సమర్థ్ మెహతల్‌తో కలిసి ఖరీదైన యంత్రాలతో పనిలేకుండా సాధారణ ఫ్యాన్‌నే గాలిని శుభ్రపరిచే యంత్రంగా మార్చాడు. దీనికి ప్రాజెక్ట్ వాయు’ అని నామకరణం చేశారు.
వీరిద్దరు రూపొందించిన ఈ ఫిల్టర్‌ను సాధారణ సీలింగ్ ఫ్యాన్‌లకు, టేబుల్ ఫ్యాన్‌లకు కూడా అమర్చుకోవచ్చు. దీని ఖరీదు సుమారుగా రూ. 140 మాత్రమే. ఈ ఫిల్టర్లను స్థానికంగా ఉండే పాఠశాలల్లో ఉచితంగా అందిస్తున్నారు ప్రాజెక్ట్ వాయు బృందం. ఇప్పటి వరకు 10 వేలకు పైగా ఫిల్టర్లను అందించారు. మరో 45 పాఠశాలలకూ అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ఫిల్టర్ ద్వారా ఇప్పటి వరకు 8 వేల మంది విద్యార్థులకు ప్రయోజనం కలిగింది.
కృష్ణ అగర్వాల్ చేసిన రూపొందించిన ఈ ఎయిర్ ఫిల్టర్‌కు అంతర్జాతీయ గుర్తింపు కూడా లభించింది. 2026 సంవత్సరానికి గాను ప్రతిష్ఠాత్మక డయానా అవార్డును అందుకున్నాడు. సమాజంలో మంచి మార్పును తీసుకు వచ్చేందుకు కృషి చేసే యువతకు వేల్స్ యువరాణి డయానా జ్ఞాపకార్థం ఈ అవార్డును అందజేస్తారు.
ఇదీ చదవండి:


