కాంచీవరం చీరలో సీతమ్మ సందడి, గోల్డెన్‌ చీరలో శ్రీలీలా స్టన్నింగ్‌ లుక్స్‌..! | Sai Pallavi wore an ivory Kanjivaram saree Sreeleela Wore Golden Saree | Sakshi
Sakshi News home page

కాంచీవరం చీరలో సీతమ్మ సందడి, గోల్డెన్‌ చీరలో శ్రీలీలా స్టన్నింగ్‌ లుక్స్‌..!

Nov 17 2026 1:19 PM | Updated on Nov 17 2026 1:22 PM

Sai Pallavi wore an ivory Kanjivaram saree Sreeleela Wore Golden Saree

సాంప్రదాయ దుస్తుల్లో అందంగా కనిపించడంలో సాయిపల్లవికి సాటి ఎవరూ లేరు. సింపుల్‌గా కనిపిస్తూనే.. ప్రత్యేకంగా కనిపించడమే ఆమె స్టైల్‌. మొన్నటి వరకు రామాయణం మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్న ఆమె ఇప్పుడూ 'ఓమ్ - చాప్టర్ 1'మూవీ ప్రమోషన్లతో హడావిడిగా ఉంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంలో ధనుష్, శ్రీలీల, మమ్ముట్టి, సాయిపల్లవి, నసీరుద్దీన్ షా తదితరులు నటించారు. 

అందుకు సంబంధించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో, సాయి పల్లవి కాంచీవరం చీరలో ఎంతో హుందాగా కనిపించగా, శ్రీలీల గోల్డెన్‌ చీరలో పుత్తడి బొమ్మలా మెరిసింది. ఇద్దరూ బ్యూటీలు తమదైన ఫ్యాషన్‌ స్టైల్‌తో ఈ ఈవెంట్‌లో హైలెట్‌గా నిలిచారు. మరి ఈ అందాల భామలు ధరించిన చీరల విశేషాలు గురించి సవివరంగా చూద్దామా..!.

ఐవరీ రంగు కాంచీవరం చీర ప్రత్యేకత ఇదే..
'ఓమ్' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో సాయి పల్లవి ఐవరీ రంగు కాంచీవరం చీర 'ది సాఫ్రాన్ హౌస్' (The Saffron House) కలెక్షన్‌కు చెందినది. ఈ చీరపై ఉన్న సున్నితమైన కుందన్ వర్క్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీనిపై ఉన్న కుందన్ డిజైన్లు 'గండభేరుండం' ప్రేరణతో డిజైన్‌ చేశారు. ప్రతి డిజైన్లో ఎరుపు రంగు రాళ్లు, బంగారు రంగులో పోల్కీ రాళ్లు పొదగబడి ఉన్నాయి. రెక్కలు విప్పిన పక్షి ఆకారంలో వంపు తిరిగి డిజైన్‌ అమ్మర్చారు. ఈ అందమైన చీరకు బంగారు జరీ బోర్డర్‌ ఉంది. అంచు వెంబడి, పల్లు భాగంలో పూల డిజైన్లు హైలెట్‌గా నిలిచాయి. 

ఈ చీరకు కాంట్రాస్ట్‌గా ఎరుపు రంగా బ్లౌజ్‌ ఎంచుకుంది. దీనిపై ఉన్న జరీ వర్క్‌ చీరలోని ఎరుపు రంగు రాళ్లతో సరిపోయింది. గుడి ఆభరణాలు పోలిన చిన్న చిన్న ఝంకీలు, రెండు చేతులకు కడాలు, బంగారు రంగు హీల్స్‌తో మెరిసింది. ఎప్పటిలానే సింపుల్‌ మేకప్‌తో చాలా చాలా సాదాసీదాగా కనిపించే ప్రయత్నమే చేసింది ఈ సీతమ్మ. కాగా ఈ చీర ధర వచ్చేసి అక్షరాల రూ. 68,500/-

బంగారు చీరలో పుత్తడి బొమ్మల శ్రీలీలా..
శ్రీలీల సాంప్రదాయ లుక్స్ ఎప్పుడూ ఫ్యాషన్ ప్రపంచంలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటాయి. ఈ నటి బంగారు రంగు ప్రీ-డ్రేప్డ్ చీరలో క్లాసిక్‌గా కనిపించారు. మహిమా మహాజన్ డిజైన్ చేసిన ప్రీ-డ్రేప్డ్ బంగారు చీరలో అందరి దృష్టిని ఆకర్షించారు. కావ్య శ్రీరామ్ స్టైలింగ్ చేసిన ఈ చీరలో శ్రీలీలా దేవకన్యలా మెరిసింది. తన లుక్‌ మరింత అందంగా కనిపించేలా స్టడెడ్‌ చోకర్‌, మ్యాచింగ్‌ చెవిపోగులను ధరించింది. 

ఈ నటి కూడా సాయిపల్లవిలా సింపుల్‌గా కనిపించేలా ప్రయత్నించింది. బంగారు బిందీ ఆమె మొత్తం లుక్‌ని మరింత ఆకర్షణీయంగా కనిపించేలా చేసింది. కాగా రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ మూవీ ఒక తమిళ భాషా పాన్-ఇండియా చిత్రం. ఈ కథ మొత్తం ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఒక సంస్థను అంతం చేసే లక్ష్యంతో చేపట్టిన రహస్య ఆపరేషన్ చుట్టూ తిరుగుతుంది.

 

ఇదీ చదవండి: గులాబీ రంగు మ్యాక్సీ డ్రెస్‌లో కాబోయే అమ్మ సమంత..!

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement