సినిమాల్లో నటించే విషయంలో కొందరు నటీనటులు అప్పుడప్పుడు సాహసాలు చేస్తుంటారు. నగ్నంగా నటించడం, నిజంగానే జత్తు కత్తిరించుకోవడం లాంటివి ఇందులో ఉంటాయి. ఇప్పుడు సాయిపల్లవి కూడా 'ఓం' కోసం హెయిర్ కట్ చేసుకున్న సంగతి బయటపెట్టింది. అయితే ఈ సంగతి తెలిసిన తర్వాత అమ్మ తనతో కొన్నిరోజులు మాట్లాడటం మానేసిందని చెప్పుకొచ్చింది.
(ఇదీ చదవండి: శ్రీహరి ఇంట పెళ్లి సందడి.. త్వరలోనే శుభకార్యం)
ధనుష్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'ఓం'. ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో దీన్ని తీశారు. మమ్ముట్టి కీలక పాత్ర చేయగా.. శ్రీలీల ఓ హీరోయిన్. ఇందులోనే సాయిపల్లవి.. పవర్‌ఫుల్ ఐపీఎస్ అధికారిణిగా నటించింది. పాత్ర కోసం నిజంగానే జుత్తు కత్తిరించుకుంది. ఆ అనుభవాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది.
'నేను జుత్తు కత్తిరించుకున్న తర్వాత అమ్మకు వీడియో కాల్ చేస్తే.. ఆమె షాకైంది. కోపంతో కాల్ కట్ చేసింది. నాన్న అయితే విగ్ పెట్టుకున్నావా అని అడిగారు. లేదు నిజంగానే కత్తిరించుకున్నానని చెప్పాను. తర్వాత అమ్మకు ఆయన సర్దిచెప్పడటానికి కొన్నిరోజులు కష్టపడాల్సి వచ్చింది. ఆ తర్వాత అమ్మ మళ్లీ నాతో మాట్లాడింది'
'వేరే దర్శకుడు ఎవరు ఇలా జుత్తు కత్తిరించుకోమన్నా నో చెప్పేదాన్ని. రాజ్ కుమార్ అడగడం వల్లే దీనికి ఒప్పుకొన్నాను. ఆయన నా పాత్ర రిఫరెన్స్ కోసం ఐపీఎస్ ఆఫీసర్ మెరిన్ జోసెఫ్ ఫొటో చూపించారు' అని సాయిపల్లవి చెప్పుకొచ్చింది. డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియసామి గత చిత్రం 'అమరన్'లో సాయిపల్లవినే హీరోయిన్. ఇప్పుడు మరోసారి వీళ్లిద్దరూ కలిసి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ ఆరు డోంట్ మిస్)


