సేతుపతికి భార్యగా.. కవల పిల్లలకు తల్లిగా | Vijay Sethupathi And Sai Pallavi Inji Vellam Release Date | Sakshi
Sakshi News home page

Inji Vellam Movie: మణిరత్నం మరో డిఫరెంట్ ప్రేమకథ

Nov 14 2026 9:08 AM | Updated on Nov 14 2026 9:08 AM

Vijay Sethupathi And Sai Pallavi Inji Vellam Release Date

ప్రముఖ దర్శకుడు మణిరత్నం తీస్తున్న లేటెస్ట్ సినిమా 'ఇంజి వెళ్లం'. తెలుగులో ఈ టైటిల్‌కి 'అల్లం బెల్లం' అని అర్థం. అంటే పేరులానే తీపి, పులుపు కలయిక లాంటి స్టోరీతో తీస్తున్న మూవీ అని తెలుస్తోంది. మణిరత్నం చివరగా తీసిన 'థగ్ లైఫ్' ఘోరమైన డిజాస్టర్ అయింది. దీంతో తనకు అచ్చొచ్చిన ప్రేమకథ వైపు వచ్చేశాడు. లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై సుభాస్కరన్‌ నిర్మించారు. ఇంతకు ముందు మణిరత్నం, లైకా ప్రొడక్షన్స్‌ కాంబినేషన్‌లో వచ్చిన 'పొన్నియిన్‌ సెల్వన్‌' ఘన విజయాన్ని సాధించింది. వీళ్ల కాంబోలో రూపొందుతున్న 'ఇంజి వెళ్లం'లో విజయ్‌ సేతుపతి, సాయిపల్లవి జంటగా నటిస్తున్నారు. ఏఆర్‌ రెహమాన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు.

(ఇదీ చదవండి: అదో పీడకల.. దేవుడి దయ వల్ల నేను బతికాను: కాజల్ అగర్వాల్)

ఇదో వైవిధ్యభరిత ప్రేమ, కుటుంబ భావోద్వేగాలతో కూడిన హృదయాలను హత్తుకునే సన్నివేశాలతో రూపొందిస్తున్న చిత్రమని యూనిట్‌ వర్గాలు పేర్కొన్నాయి. మణిరత్నం కెరీర్‌లోనే అతి తక్కువ సమయంలో పకడ్బందీ ప్రణాళికతో షూటింగ్‌ను పూర్తి చేసుకున్న సినిమా ఇదే. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని.. వచ్చే ఏడాది జనవరి 29న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో కవల ఆడపిల్లలకు తల్లిగా సాయిపల్లవి కనిపించనుంది.

(ఇదీ చదవండి: సాయిపల్లవి ఫైట్స్.. 'ఓం' ట్రైలర్ చూశారా?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement