అదో పీడకల.. దేవుడి దయ వల్ల నేను బతికాను | Kajal Aggarwal Recalls Indian 2 Horrific Incident | Sakshi
Sakshi News home page

Kajal Aggarwal: 100 అడుగుల క్రేన్ నా కళ్లముందే.. భయంతో వణికిపోయా

Nov 13 2026 1:19 PM | Updated on Nov 13 2026 1:33 PM

Kajal Aggarwal Recalls Indian 2 Horrific Incident

సినిమా చూడటానికి తెరపై అందంగానే ఉంటుంది. కానీ తెర వెనక చాలా కష్టంతో పాటు అప్పుడప్పుడు ప్రమాదాలూ జరుగుతుంటాయి. కమల్ హాసన్ 'ఇండియన్ 2' షూటింగ్ సందర్భంగా అలాంటి ఓ ఘోర ప్రమాదం జరిగి ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. అయితే తాను ఆ ప్రమాదంలో చనిపోయేదాన్ని అని చెప్పిన కాజల్.. ఎలా బతికి బయటపడ్డానో తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

(ఇదీ చదవండి: మౌళి 'డీఎన్‌కే' (దొంగ నా కొడుకు) రివ్యూ)

'వారం క్రితం సింగపూర్‌లోని నా మైనపు విగ్రహావిష్కరణ జరిగింది. అందులో పాల్గొని తిరిగి ఇండియన్ 2(భారతీయుడు 2) షూటింగ్ కోసం చెన్నై వచ్చాను. స్వాతంత్య్రానికి పూర్వం జరిగే యాక్షన్ సీన్స్ రాత్రిపూట తీస్తున్నారు. నేను 80ఏళ్ల మహిళగా మేకప్‌లో ఉన్నా. సాధారణంగా మా సీన్స్‌ లేకపోతే మానిటర్ దగ్గర కూర్చుని చూస్తుంటాం. కానీ ఆ రోజు అక్కడ కూర్చోలేదు. నడుచుకుంటూ ముందుకు వెళ్తుంటే, ఉన్నట్టుండి 100 అడుగుల భారీ క్రేన్‌ నా కళ్ల ముందే కూలిపోయింది. నా మీద కూడా క్రేన్‌ పడిపోయిందేమో అనుకున్నా'

'మొదట నేను చనిపోయేదాన్ని. కానీ ఎవరో నన్ను చేయిపట్టుకుని వెనక్కి లాగారనిపించింది. కళ్ల ముందే ప్రమాదం జరగడంతో భయంతో వణికిపోయాను. కదలకుండా ‍అక్కడే ఉండిపోయాను. ఒక్కసారి తేరుకుని అందరితో కలిసి పరిగెత్తడం మొదలుపెట్టాను. ఆ సంఘటన తలుచుకుంటే ఇప్పటికీ ఒళ్లు జలదరిస్తుంది. దేవుడి దయ వల్లే ప్రాణాలతో బయటపడ్డాను. అప్పటి నుంచి కృష్ణుడి భక్తురాలిగా మారిపోయా' అని కాజల్ సదరు ప్రమాదం గురించి చెప్పుకొచ్చింది.

'ఇండియన్ 2' విషయానికొస్తే చాలా కష్టాలుపడి 2024లో థియేటర్లలో రిలీజైంది. నిర్మాతకు ఘోరమైన నష్టాలు మిగిల్చింది. దర్శకుడు శంకర్ కూడా దారుణమైన విమర్శలు ఎదుర్కొన్నారు. అప్పటినుంచి శంకర్ మరో కొత్త మూవీ చేయలేదు. ప్రస్తుతం 'ఇండియన్ 3' షూటింగ్ జరుగుతోంది. వచ్చే ఏడాది దీని రిలీజ్ ఉండే అవకాశముంది.

(ఇదీ చదవండి: విరిగిన పక్కటెముకులు.. 'సలార్' నటుడికి ఏమైంది?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement