నెలాఖర్లో మళ్లీ దశావతారం | Dasavataram to re release on November 28 | Sakshi
Sakshi News home page

నెలాఖర్లో మళ్లీ దశావతారం

Nov 8 2026 2:02 AM | Updated on Nov 8 2026 2:02 AM

Dasavataram to re release on November 28

‘దశావతారం’ (2008) సినిమా రీ రిలీజ్‌ కానుంది. కమల్‌హాసన్‌ హీరోగా కేఎస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘దశావతారం’. అసిన్‌ ద్వి పాత్రాభినయం చేసిన ఈ చిత్రంలో జయప్రద, మల్లికా షెరావత్‌ ఇతర ప్రధాన  పాత్రల్లో నటించారు. ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ సినిమాలో కమల్‌హాసన్‌ పది విభిన్నమైన  పాత్రల్లో నటించి, మెప్పించారు. ఈ నెల 28న సుదీక్ష ఎంటర్‌టైన్‌మెంట్‌ ఈ సినిమాను రీ రిలీజ్‌ చేయనుంది. 

శనివారం (నవంబరు 7) కమల్‌హాసన్‌ బర్త్‌ డే సందర్బంగా ఈ విషయాన్ని ప్రకటించారు. ‘‘కమల్‌హాసన్‌ నటనలోని వైవిధ్యం, ‘దశావతారం’ సృష్టించిన అద్భుతం ఎప్పటికీ ప్రత్యేకంగానే ఉంటుంది. ఈ చిత్రం ప్రేక్షకులను మరోసారి అలరిస్తుందని నమ్ముతున్నాం’’ అని యూనిట్‌ పేర్కొంది. ఇదిలా ఉంటే...  కమల్‌హాసన్‌ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘సండియర్‌’ షూట్‌ శనివారం ప్రారంభమైంది. ఈ సినిమాకు ఎస్‌.యు. అరుణ్‌కుమార్‌ దర్శకుడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement