దక్షిణాదితో పాటు హిందీలోనూ సినిమాలు చేసి పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లలో శ్రుతి హాసన్ ఒకరు. లక్ అనే హిందీ చిత్రంతో కథానాయికిగా ఎంట్రీ ఇచ్చి తన లక్కుని పరీక్షించుకున్న ఈమె.. మొదట సంగీతంపై మక్కువతో ఆ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి ఒక టీమ్‌ని ఏర్పాటు చేసుకుంది. తర్వాత హీరోయిన్, సంగీత దర్శకురాలు, గాయనిగా తన ప్రత్యేకతని చాటుకుంది. సంచలన నటిగా ముద్ర వేసుకున్న ఈ బ్యూటీ.. ఎప్పుడూ ఏదో ఒక అంశంతో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. శృతిహాసన్ స్టార్ హీరోయిన్ అయినా కానీ నటిని ఎలా అయ్యానో నాకే తెలియదని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.
నిజం చెప్పాలంటే నేను డబ్బు కోసమే నటిగా మారాను. ఇండిపెండెంట్ మ్యూజికల్ ఆల్బమ్స్ చేయడానికి డబ్బు అవసరం అయ్యింది. అలాంటి సమయంలో అనూహ్యంగా లక్ అనే హిందీ చిత్రంలో నటించే అవకాశం రావడంతో వెంటనే ఒప్పేసుకున్నాను. తర్వాత పలు భాషల్లో వరుసగా అవకాశాలు రావడంతో అదే వృత్తిగా మారిపోయింది. బాలనటిగానూ ఇదే పరిస్థితి. అమ్మా నాన్న వృత్తి పరంగా చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు. వారితో కలిసి షూటింగ్‌లకు వెళ్లేదాన్ని. అలా నాన్న (కమలహాసన్) హే రామ్ చిత్రం చేస్తుండగా, ఆ సినిమా కోసం అనుకోకుండా బాలనటిగా చేశాను. అదీ నాన్న కోరితేనే నటించాను. అదే నటిగా నా తొలి అనుభవం అని శ్రుతి హాసన్ చెప్పుకొచ్చింది.
తమిళంలో మిస్కిన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతితో కలిసి శ్రుతి హాసన్ నటించిన 'ట్రైన్' సినిమా త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. తెలుగులో 'ఆకాశంలో ఒక తార' అనే చిత్రం చేసింది.


