మైనర్‌ వేధింపుల కేసు.. సింగర్‌ చిన్మయి సంచలన వ్యాఖ్యలు | Singer chinmayi about hn bhaskar | Sakshi
Sakshi News home page

మైనర్‌ వేధింపుల కేసు.. సింగర్‌ చిన్మయి సంచలన వ్యాఖ్యలు

Nov 23 2026 4:15 PM | Updated on Nov 23 2026 4:21 PM

Singer chinmayi about hn bhaskar

కర్ణాటక సంగీత రంగంలో ప్రముఖ వయోలిన్ విద్వాంసుడిగా గుర్తింపు పొందిన హెచ్‌.ఎన్‌. భాస్కర్‌ అమెరికాలో అరెస్టు కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. మైనర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు నమోదైన కేసులో ఆయనను పోలీసులు అరెస్టు చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ ఘటనపై గాయని చిన్మయి శ్రీపాద స్పందించారు. బాధితులకు అండగా నిలుస్తూ సోషల్ మీడియా వేదికగా వరుస పోస్టులు పెట్టారు.

పోక్సో చట్టం పరిధిలోకి
‘నాకు పలువురు బాధితుల నుంచి మెసేజ్‌లు వస్తున్నాయి. ఈ విద్వాంసుడి వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నవారు చాలామంది ఉన్నారు. ఇప్పుడా వివరాలు.., స్క్రీన్‌షాట్లను బయటపెట్టలేను.  బాధితుల్లో చాలామంది చిన్న వయసు వారే ఉన్నారు. కొన్ని ఘటనలు పోక్సో చట్టం పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది. బాధితులకు సరైన న్యాయసహాయం అందేలా చూస్తాను. న్యాయవాదులతో మాట్లాడించి అవసరమైన సహకారం అందిస్తా. అని పోస్ట్‌లో పేర్కొన్నారు.

అయితే బాధితులంతా ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేయాలని చిన్మయి కోరారు. ఈ విషయంలో ఒంటరిగా ఉన్నామనే భావన వద్దని, మీకు మద్దతు దొరుకుతుందని భరోసా ఇచ్చారు.

(ఇదీ చదవండి: అప్పుడు కాదు.. ఇప్పుడు నేనేంటో చూస్తారు: డింపుల్‌)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement