breaking news
bhasker
-
వెయిటర్ టు కరోడ్‌పతి: కె.ఆర్. భాస్కర్ ఇన్స్పైరింగ్ జర్నీ
ఎపుడు ఎలా పనిచేశామన్నది కాదు. సక్సెస్ సాధించామా లేదా అన్నది ముఖ్యం. తమ అభిరుచికి, నైపుణ్యానికి కాస్త పట్టుదల, కృషి జోడిస్తే విజయం మనముందు సాగిలపడుతుంది. దీన్నే అక్షరాలా నిరూపించి చూపించారు కె.ఆర్. భాస్కర్. హోటల్లో వెయిటర్‌గా మొదలైన భాస్కర్ ప్రయాణం కోట్ల రూపాయల లాభాలను తెచ్చిపెడుతోంది. ఇంతకీ ఆయన సాధించిన విజయం ఏంటి? కేఆర్ భాస్కర్ స్ఫూర్తి దాయక స్టోరీ గురించి తెలుసుకుందాం.ఎక్కడైనా రుచి కరమైన టిఫిన్లు, ఆహారం లభిస్తోందంటే ఆహార ప్రియులకు పండగే. ఎంతదూరమైనా వెళ్లి దాని రుచిని ఆస్వాదించాల్సిందే. మళ్లీ మళ్లీ తిని ఆహా..! అనాల్సిందే. అంతేకాదు నలుగురికీ వారి ద్వారా జరిగే మౌత్ పబ్లిసిటీ విజయం తక్కువేమీకాదు. అంతటి మహిమ ఫుడ్ బిజినెస్‌కు ఉంటుంది. కేఆర్ భాస్కర్ తయారు చేసే బొబ్బట్ల (పూరన్ పోలి) వాసనకే ఆహార ప్రియులు పరవశులైపోతారు. ఆ సువాసన ముక్కు పుటాలకు తాకిన వారెవ్వరూ వాటి రుచి చూడకుండా వదిలిపెట్టరు.కర్ణాటక,మహారాష్ట్రలోని సందడిగా ఉండే వీధుల్లో 'భాస్కర్ పురాన్పోలి ఘర్' అలా వేలాది కస్టమర్లను ఆకర్షిస్తుంది. రెండు రాష్ట్రాలలో విస్తరించింది.ఇదీ చదవండి: 30 డేస్ ఛాలెంజ్ : ఇలా చేస్తే యవ్వనంగా, ఆరోగ్యంగా!భాస్కర్ కథ స్ఫూర్తి దాయకమైనది. కర్ణాటకలోని కుందాపూర్‌లో పేద రైతు కుటుంబంలో జన్మించిన ఆయన చిన్నప్పటి నుంచీ కష్టాలను ఎదుర్కొన్నారు. కానీ ఆయన ఎప్పుడూ తన కలలను వదులుకోలేదు! అవిశ్రాంత పట్టుదలకు ఓరిమికి నిదర్శనం ఆయన సక్సెస్ జర్నీ. కర్ణాటకలో పెరిగిన ఆయన చిన్న వయసులోనే ఉద్యోగ రంగంలోకి దిగారు. కేవలం 12 సంవత్సరాల వయసులోనే బెంగళూరులోని ఒక హోటల్లో టేబుల్స్ శుభ్రం చేయడం , పాత్రలు కడగడం వంటి పనులు చేసేవాడు. అలా దాదాపు ఐదేళ్లకు పైగా భాస్కర్ వెయిటర్‌గా పనిచేశాడు. ఆ అనుభవమే ఈ వ్యాపారంపై లోతైన అవగాహన కలిగింది. అలాతన జీవితాన్ని మలుపు తిప్పిన వైనాన్ని. షార్క్ ట్యాంక్ ఇండియా సీజన్ 2లో భాస్కర్ తన విజయగాథను పంచుకున్నారు.అంతకుముందు ఎనిమిదేళ్ల పాటు నృత్య బోధకుడిగా పనిచేశాడు. పాన్ షాప్ ఓపెన్ చేశాడు. కానీ పెద్దగా సక్సెస్‌కాలేదు. తన పాక నైపుణ్యంతో ఫుడ్బిజినెస్లోకి ఎంట్రీ ఇచ్చాడు. 23 ఏళ్ల వయసులో తన తల్లి సహకారంతో నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా, రుచికరమైన బొబ్బట్లను తయారు చేసి సైకిల్ మీద వీధుల్లో అమ్మడం ప్రారంభించాడు. ఆ చిన్న అడుగే కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యానికి బాటలు వేసింది. పురాన్పోలి తయారీలో అతని ప్రతిభకు, వాటి టేస్ట్‌కు అందరూ ఫిదా అయిపోయారు. 'పూరన్ పోలి ఘర్ ఆఫ్ భాస్కర్' త్వరలోనే నాణ్యత ,అభిరుచికి పర్యాయపదంగా మారింది. కట్ చేస్తే భాస్కర్ సంస్థ కర్ణాటకలోనే 17 అవుట్లెట్లు,10 కి పైగా ఫ్రాంచైజీలతో వ్యాపారం చేస్తున్నాడు. పెరుగుతున్న డిమాండ్‌ను ప్రతిబింబంగా ప్రతీ ఎనిమిది నెలలకో అవుట్‌లెట్‌ను ప్రారంభిస్తాడు. చాలా సాదా సీదాగా వీధి వెంచర్‌గా ప్రారంభమైన ఈ వ్యాపారం, ఇప్పుడు నెలవారీ ఆదాయాన్ని 18 కోట్లకు పైగా ర్జిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో 3.6 కోట్ల నికర లాభాన్ని సాధించడం విశేషం.. 'పురాన్పోలి ఘర్ ఆఫ్ భాస్కర్' విజయం భాస్కర్ పాక నైపుణ్యానికి మాత్రమే కాకుండా అతని వ్యాపార చతురతకు కూడా ఒక అద్భుతమైన ఉదాహరణ. రుచిలోనూ, నాణ్యతలో ఎక్కడా రాజీ పడకుండా పట్టుదల ,అంకితభావంతో నిరంతరం అనేక కొత్త ఉత్పత్తులు, కొత్త రుచులతో ఇష్టమైన బ్రాండ్‌గా అవతరించింది. ఇదంతా కె.ఆర్. భాస్కర్ అచంచలమైన సంకల్పశక్తికి నిదర్శనం.చదవండి: Operation Sindoor : అంబానీ లెక్క అది...తొలి సంస్థగా రిలయన్స్! -
అధికారి ఇంట్లో సోదాలు.. 3 కేజీల బంగారం
-
అధికారి ఇంట్లో సోదాలు.. 3 కేజీల బంగారం
హైదరాబాద్: ఆదాయానికి మించి ఆస్తులున్న కేసులో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అడిషనల్ కమిషనర్ కె.ఎల్.భాస్కర్‌కు సంబంధించిన ఇళ్లలో రెండో రోజు కూడా ఏసీబీ సోదాలు కొనసాగాయి. హైదరాబాద్ సీతాఫల్‌మండిలోని హార్మోని హైట్స్‌లో ఉన్న ఇంట్లో 3 కేజీల బంగారం, 15 కేజీల వెండి, ఏపీ, తెలంగాణల్లోని ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భాస్కర్‌ను అరెస్టు చేసి విశాఖపట్నంకు తరలిస్తున్నారు. (చదవండి: ఎక్సైజ్ కమిషనర్‌పై ఏసీబీ పంజా) -
కలెక్టర్ కొరడా
ఏలూరు సిటీ : కలెక్టర్ కె.భాస్కర్ వ్యవహార శైలి ఉద్యోగ వర్గాల్లో గుబులు పుట్టిస్తోంది. ముడుపులు ఇవ్వనిదే పనిచేయడం లేదనే ఆరోపణ ఎదుర్కొన్న ఒక వీఆర్వోను ఇటీవల తన కార్యాలయానికి పిలిపించుకుని అతడికి లంచంగా రూ.5 వేలు ఇచ్చిన కలెక్టర్.. తాజాగా ప్రభుత్వం కేటాయించిన డిజిటల్ కీ తెరిచి వెళ్లిన ఉద్యోగి పేరిట ఆన్లైన్లో రాజీనామా లేఖ సమర్పించారు. వివరాల్లోకి వెళితే.. నగరంలోని ప్రభుత్వ కార్యాలయాలను శుక్రవారం కలెక్టర్ పరిశీలించారు. వ్యవసాయ, ఉద్యాన శాఖలతోపాటు సర్వశిక్ష అభియాన్, డీఈవో, జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాలకు వెళ్లి ఈ–ఫైలింగ్ విధానం అమలుపై ఆరా తీశారు. జిల్లా రిజిస్ట్రార్ కార్యాల యంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న బి.విజయలక్ష్మి ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్టుగా ఆమె పేరిట కలెక్టర్ లేఖ రాసి దానిని తక్షణమే ఆమోదించాలని కోరుతూ జిల్లా రిజిస్ట్రార్‌కు ఆన్లైన్లో పంపించారు. జూనియర్ అసిస్టెంట్ విజయలక్ష్మి శుక్రవారం సెలవు పెట్టారు. కలెక్టర్ ఆ కార్యాలయాన్ని తనిఖీ చేస్తుండగా.. విజయలక్ష్మికి ప్రభుత్వం కేటాయించిన డిజిటల్ కీ, మెయిల్ ఐడీ తెరిచి ఉండటాన్ని గమనించారు. సెలవులో ఉండి డిజిటల్ కీ ఎలా తెరిచి వెళ్లారని ప్రశ్నిం చారు. విజయలక్ష్మి మెయిల్ ఐడీ నుంచి ఆమె పేరిట రాజీనామా లేఖను కలెక్టర్ స్వయంగా కంపోజ్ చేసి ఆన్లైన్లో జిల్లా రిజిస్ట్రార్‌కు పంపించారు. ఆ సమయంలో జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో లేకపోవడంతో ఆమె వచ్చాక.. విజయలక్ష్మి రాజీనామా లేఖను తనకు ఆన్లైన్లో పంపాలని జాయింట్ రిజిస్ట్రార్ వెంకటేశ్వర్లును కలెక్టర్ ఆదేశించారు. ఈ ఫైలింగ్‌లో నిర్లక్ష్యంపై ఆగ్రహం ఈ–ఫైలింగ్ విధానంపై వ్యవసాయ శాఖ నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. కనీసం ఫైల్ ఎలా తయారు చేయాలో సిబ్బందికి అవగాహన లేకపోవడం శోచనీయమన్నారు. ఇలా అయితే భవిష్యత్‌లో రికార్డులు ఎలా భద్రంగా ఉంటాయని జేడీ వై.సాయిలక్ష్మీశ్వరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వశిక్షాభియాన్ జిల్లా కార్యాలయం ఆర్థిక విభాగంలో నలుగురు పనిచేస్తుంటే ఒకేసారి ఇద్దరు సెలవుపెడితే ఎలాగంటూ పీవో బ్రహ్మానందరెడ్డిని ప్రశ్నించారు. ఎవరిష్టం వచ్చినట్టు వారు కార్యాలయంలోని బీరువాలకు తాళాలు వేసుకుని వెళ్లిపోతే ఎలాగని నిలదీశారు. డీఈవో కార్యాలయాన్ని పరిశీలించిన ఆయన తలుపుల నిండా ఉద్యోగ సంఘాల క్యాలెం డర్లు అతికించి ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం రూ.72 లక్షలతో నిర్మించిన డీఈవో కార్యాలయ నూతన భవనాన్ని పరిశీ లించారు. ఇతర నిధుల నుంచి రూ.10 లక్షలు మంజూరు చేస్తానని, యుద్ధప్రాతిపదికన పనులు పూర్తిచేయాలని డీఈవో డి.మధుసూదనరావును ఆదేశించారు. ప్రభుత్వ ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ ఆన్లైన్లోనే జరగాలని ఏడాది నుంచి చెబుతున్నా పాత విధానాన్ని అమలు చేస్తున్న ఉద్యాన శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ విజయలక్ష్మికి షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నట్టు కలెక్టర్ పేర్కొన్నారు. -
ప్రవాసాంధ్రులు ఐక్యంగా ఉండాలి
–కాపునాడు జిల్లా అధ్యక్షుడు భాస్కర్ పిలుపు యూనివర్సిటీ క్యాంపస్: అమెరికాలోని ప్రవాసాంధ్రులు ఐకమత్యంతో మెలగాలని ఏపీ కాపునాడు చిత్తూరు జిల్లా అధ్యక్షుడు దేపూరి భాస్కర్ కోరారు. అమెరికాలోని అట్లాంటా ప్రాంతంలో అమెరికన్ పోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ (ఏపీటీఏ) ఆధ్వర్యంలో మంగళవారం ప్రవాసాంధ్రుల సమ్మర్ ఫెస్టివల్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన దేపూరి భాస్కర్ మాట్లాడుతూ ప్రవాసాంధ్రులు ఏపీలోని బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి సహకరించాలని కోరారు. ఏపీలో కాపులను బీసీలుగా మార్చడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు పసుపులేటి సురేష్ పాల్గొన్నారు. -
మద్యం మత్తులో యువకుడు ఆత్మహత్యాయత్నం
ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో ఆదివారం దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో భాస్కర్ అనే యువకుడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని... నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. దీంత కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి మంటలార్పి... ఆతడిని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తమాషా చేస్తున్నారా...?
ఇరిగేషన్ ఏఈపై మండిపడ్డ కలెక్టర్ నీతూప్రసాద్ వెల్గటూరు : ఏం తమాషా చేస్తున్నారా... వారం రోజుల నుంచి చెప్పుతున్నా ను... భక్తులకు కొత్తఘాట్లను అందుబాటులోకి తేవాలని.. మీరెందుకు పట్టిం చుకోవటం లేదు... జాబ్ చేస్తున్నారా.. చోద్యం చూస్తాన్నారా... మనుషుల ప్రా ణాలంటే విలువలేదా..? అని ఇరిగేషన్ ఏఈ భాస్కర్‌పై బుధవారం కలెక్టర్ నీతూ ప్రసాద్ తీవ్రంగా మండిపడ్డారు. కోటిలింగాల పుష్కర ఘాట్లను పొద్దు పోయాక కలెక్టర్ పరిశీలించారు. కొత్తఘాట్ల కింద ఇసుక బస్తాలను వేసి వాటి ని వినియోగంలోకి తేవాలని వారం రోజుల ముందు నుంచి చెబుతున్నాను. ఎందుకు ఆదేశాలను ఖాతర్ చేయడంలేదని ఏఈపై విరుచుకపడ్డారు. వారం రోజులు నుంచి చెప్పుతున్నా ఘాట్ల వద్ద ఎలాంటి మార్పులు చేపట్టలేదని ఆగ్రహించారు. ఈ రోజు వచ్చిన 25 వేల మంది భక్తులే పుణ్య స్నానాలు చేయడానికి చాల ఇక్కట్లు పడ్డారు. రేపు రెట్టింపు సంఖ్యలో భక్తులు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. వారిని ఎలా మెయింటెన్ చేస్తారని మండిపడ్డారు. ఖచ్చితంగా రెండు రోజుల్లో కొత్త పుష్కర ఘాట్లను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. కొత్త పుష్కర ఘాట్లను ఎలా పెంచితే భక్తులకు వినియోగ పడుతాయనుకుంటే అలాగే చేయించండి, ఎంత డబ్బు అవసరమైనా ప్రభుత్వం నుంచి అందజేస్తామని, ఎంపీపీ శ్రీనివాసరావుకు పుష్కర ఘాట్లను పెంచే బాధ్యతలను కలెక్టర్ అప్పగించారు.