ప్రవాసాంధ్రులు ఐక్యంగా ఉండాలి | nri are unity | Sakshi
Sakshi News home page

ప్రవాసాంధ్రులు ఐక్యంగా ఉండాలి

Aug 3 2016 12:58 AM | Updated on Sep 4 2017 7:30 AM

ప్రవాసాంధ్రుల సమావేశంలో ప్రసంగిస్తున్న దేపూరి భాస్కర్‌

ప్రవాసాంధ్రుల సమావేశంలో ప్రసంగిస్తున్న దేపూరి భాస్కర్‌

అమెరికాలోని ప్రవాసాంధ్రులు ఐకమత్యంతో మెలగాలని ఏపీ కాపునాడు చిత్తూరు జిల్లా అధ్యక్షుడు దేపూరి భాస్కర్‌ కోరారు.

 
 
–కాపునాడు జిల్లా అధ్యక్షుడు భాస్కర్‌ పిలుపు
యూనివర్సిటీ క్యాంపస్‌: అమెరికాలోని ప్రవాసాంధ్రులు ఐకమత్యంతో మెలగాలని ఏపీ కాపునాడు చిత్తూరు జిల్లా అధ్యక్షుడు దేపూరి భాస్కర్‌ కోరారు. అమెరికాలోని అట్లాంటా ప్రాంతంలో అమెరికన్‌ పోగ్రెసివ్‌ తెలుగు అసోసియేషన్‌ (ఏపీటీఏ) ఆధ్వర్యంలో మంగళవారం ప్రవాసాంధ్రుల సమ్మర్‌ ఫెస్టివల్‌ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన దేపూరి భాస్కర్‌ మాట్లాడుతూ ప్రవాసాంధ్రులు ఏపీలోని బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి సహకరించాలని కోరారు. ఏపీలో కాపులను బీసీలుగా మార్చడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు పసుపులేటి సురేష్‌ పాల్గొన్నారు.
 
 
 

Advertisement
 
Advertisement
Advertisement