శర్వానంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘భోగి’. ఇందులో హీరోయిన్ డింపుల్ హయాతి..మందారం పాత్రతో అలరించనుంది. ఈ మూవీ నవంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మేరకు నిన్న( ఆదివారం) హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది చిత్ర బృందం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డింపుల్ తన కెరీర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
నటనను నిరూపించుకోవాలని
‘ప్రతి నటికి తనలోని నటనను నిరూపించుకోవాలని ఉంటుంది. దీనికి ఒక బలమైన పాత్ర దక్కాలి. కానీ మనకు ఏ అవకాశాలు అయితే వస్తుంటాయో.. వాటినే చేసుకుంటూ వెళ్తాం. ఇప్పటిదాకా నన్ను కేవలం గ్లామర్ డాల్‌గా, పాటలు, డ్యాన్సలు చేసే అమ్మాయిగానే చూశారు.
కానీ నా కళ్లలో ఉన్న ప్రతిభని గుర్తించి.. నా నటనపై దృష్టి పెట్టిన మొదటి దర్శకుడు సంపత్ నంది గారే. ఇందులో నేను చేసిన ‘మందారం’ పాత్ర నా కెరీర్‌కు ఓ కొత్త దారిని చూపిస్తుంది. ఈ సినిమాలో నాతో ఒక్క సాంగ్‌తో కూడా డ్యాన్స్ చేయించలేదు. కేవలం కొత్త డింపుల్ హయాతిని మాత్రమే చూస్తారు’ అని చెప్పుకొచ్చారు.
(ఇదీ చదవండి: ఒక్క మాటతో.. నాగచైతన్యకు భార్య స్పెషల్ విషెస్..!)


