ది బ్రేకింగ్ న్యూస్‌.. అనన్య నాగళ్ల కొత్త సినిమా | Ananya Nagalla Latest Movie The Breaking News release on this date | Sakshi
Sakshi News home page

Ananya Nagalla: ది బ్రేకింగ్ న్యూస్‌.. అనన్య నాగళ్ల కొత్త సినిమా

Nov 23 2026 1:20 PM | Updated on Nov 23 2026 1:20 PM

Ananya Nagalla Latest Movie The Breaking News release on this date

సీనియర్ నటుడు మురళీ మోహన్, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ది బ్రేకింగ్ న్యూస్. ఈ చిత్రానికి పవన్ కడియాల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఓపెన్ స్కై క్రియేషన్స్ బ్యానర్‌పై హనుమంత రెడ్డి, ఉమా గుటూర్ నిర్మిస్తున్నారు. ఈ రోజుల్లో మీడియా రంగం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. 

(ఇది చదవండి: కిరణ్ అబ్బవరం కొత్త సినిమా.. ఆసక్తిగా టైటిల్ రివీల్ పోస్టర్)

ఇటీవలే ట్రైలర్ రిలీజ్‌ చేయగా సినీ ప్రియులను తెగ ఆకట్టుకుంటోంది. ట్రైలర్ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. వార్తా ప్రపంచంలోని పరిణామాలు, మీడియా నేపథ్యంలో సాగే కథాంశంతో ఈ సినిమా రూపొందించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఈ మూవీని డిసెంబర్ 11న థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు  ప్రకటించారు.  ఈ మూవీలో సోనియా నాయుడు, ఆర్.కె. నాయుడు, వాసుదేవ్, ప్రేమ్ కృష్ణ, రవి ప్రకాష్, వాహిని  కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి శశి ప్రీతమ్ సంగీతమందిస్తున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement