మేనరిక వివాహాలపై సుప్రీం కీలక వ్యాఖ్యలు | Supreme Court Key Directives To Center Marriages Between Blood Relatives | Sakshi
Sakshi News home page

మేనరిక వివాహాలపై సుప్రీం కీలక వ్యాఖ్యలు

Nov 21 2026 8:57 AM | Updated on Nov 21 2026 9:12 AM

Supreme Court Key Directives To Center Marriages Between Blood Relatives

ఢిల్లీ: మేనరికం వివాహాల వల్ల కలిగే జన్యుపరమైన ఆరోగ్య సమస్యలను అరికట్టేందుకు ప్రత్యేక చట్టం లేదా ప్రజల్లో అవగాహన కల్పించడంపై వివరణ ఇవ్వాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు కోరింది. వివాహ ఆచారాలను నియంత్రించడం పార్లమెంటు పరిధిలోని అంశమని, తాము చట్టం చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించలేమని, కేవలం ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడానికి మాత్రమే నోటీసు ఇస్తున్నామని కోర్టు స్పష్టం చేసింది. ఆచారాల పేరుతో మేనరికం వివాహాలకు అనుమతించే హిందూ వివాహ చట్టాన్ని 20 ఏళ్ల న్యాయ విద్యార్థిని చార్వి సవాలు చేశారు.

40 శాతం దృష్టి లోపం ఉన్న ఆమె.. ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ జాయ్‌మాల్యా బాగ్చి, జస్టిస్‌ వి. మోహనలతో కూడిన ధర్మాసనం విచారించింది. చట్టం ఆలోచనతోపాటు, రక్త సంబం«దీకుల వివాహాల వల్ల కలిగే దుష్ప్రభావాలపై పాఠశాల, కళాశాల పాఠ్యాంశాల్లో చేర్చాలని, అంగన్‌వాడీ కార్యకర్తలు, పంచాయతీల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో విస్తృత ప్రచారం కల్పించాలని ధర్మాసనం సూచించింది.

జీవిత భాగస్వామిని ఎంచుకోవడం వ్యక్తిగత ఇష్టమని, అయితే సరైన శాస్త్రీయ అవగాహనతో కూడిన నిర్ణయం తీసుకోవడం ముఖ్యమని సీజేఐ వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా 11 శాతం వివాహాలు రక్త సంబందీకుల మధ్య జరుగుతుండగా, దక్షిణ భారతదేశంలో 23 శాతం నుంచి 28 శాతం మేనరిక వివాహాలు జరుగుతున్నాయని పిటిషనర్‌ పేర్కొన్నారు. ఇలాంటి వివాహాల వల్ల పిల్లల్లో పుట్టుకతోనే లోపాలు, జన్యుపరమైన వ్యాధులు రెట్టింపయ్యే ప్రమాదం ఉందన్న వైద్య అధ్యయనాలను కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

ఇదీ చదవండి: తమిళనాడు రహస్యాలు ఏపీకి లీక్‌.. 15 మందిపై వేటు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement