breaking news
directives
-
‘సంచార్ సాథీ’పై కలకలం
సైబర్ భద్రతను లక్ష్యంగా చేసుకుని భారత ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ‘సంచార్ సాథీ’ యాప్‌ను అన్ని కొత్త స్మార్ట్‌ఫోన్‌ల్లో ప్రీలోడ్ చేయాలనే ఆదేశాలపై వ్యతిరేకత వస్తుంది. గోప్యతా సమస్యలు, యాప్ అమలులో ఉన్న చిక్కులను ఉదహరిస్తూ యాపిల్ (Apple) వంటి ప్రముఖ మొబైల్ తయారీదారులు ఈ ఆదేశాలను పాటించేందుకు నిరాకరిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రతిపక్షాలు కూడా ఈ యాప్ ఇన్‌స్టాల్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కేంద్ర కమ్యూనికేషన్స్ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మంగళవారం స్పందించారు. యాప్‌ను మొబైల్లో ఇన్స్టాల్ చేయాలా లేదా అన్నది పూర్తిగా యూజర్ల ఇష్టంమేరకే ఉంటుందని ప్రకటించారు. వినియోగదారులు కావాలనుకుంటే దాన్ని తొలగించుకోవచ్చని స్పష్టం చేశారు.ప్రీ-ఇన్‌స్టాల్‌పై డాట్ పట్టుడిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) నవంబర్ 28న జారీ చేసిన ఆదేశాల ప్రకారం యాపిల్, శామ్సంగ్, షావోమీ వంటి తయారీదారులు 90 రోజుల్లోగా భారతదేశంలో విక్రయించే అన్ని కొత్త మొబైల్ హ్యాండ్‌సెట్‌ల్లో సంచార్ సాథీ యాప్‌ను తప్పనిసరిగా ప్రీ-ఇన్స్టాల్ చేయాలి. ఇప్పటికే వినియోగంలో ఉన్న ఫోన్లకు సాఫ్ట్వేర్ అప్డేట్ల ద్వారా ఈ యాప్ అందేలా చూడాలని సూచించారు.ప్రభుత్వం ఉద్దేశం ఏమిటంటే..డూప్లికేట్ ఐఎంఈఐ (ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ) నంబర్లు, దొంగ పరికరాల విక్రయాలు, సైబర్ మోసాలను అరికట్టడం.జనవరి 2025లో ప్రారంభించినప్పటి నుంచి ఈ యాప్ 7 లక్షలకు పైగా దొరికిన ఫోన్లను తిరిగి పునరుద్ధరించింది. 42 లక్షలకు పైగా నకిలీ/దొంగ పరికరాలను బ్లాక్ చేసింది.ఈ ఆదేశాలు టెలికాం యాక్ట్ 2023, టెలికాం సైబర్ సెక్యూరిటీ రూల్స్ 2024 ప్రకారం జారీ అయ్యాయని డాట్ తెలిపింది. వీటిని పాటించడంలో విఫలమైతే చట్టపరమైన చర్యలు, జరిమానాలు ఉంటాయని స్పష్టం చేసింది. అయితే డాట్ అసలు ఉత్తర్వులో యాప్ ఫంక్షనాలిటీలను నిలిపివేయడం (Disabled) లేదా పరిమితం చేయడం (Restricted) కుదరదని పేర్కొనడం తీవ్ర ఆందోళనలకు దారితీసింది.యాపిల్ గోప్యతా ప్రమాణాలుప్రపంచవ్యాప్తంగా వినియోగదారుల గోప్యతకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చే యాపిల్ ఈ తప్పనిసరి ప్రీ-ఇన్స్టాలేషన్ ఆదేశాలను పాటించే ఆలోచన లేదని భారత ప్రభుత్వానికి తెలియజేయడానికి సిద్ధమవుతోంది. ఇలాంటి ప్రభుత్వ నిబంధనలు తమ ఐఓఎస్ ప్లాట్‌ఫాం భద్రతా, గోప్యతా విధానాలకు విరుద్ధమని, ఇది యాప్ స్టోర్ ఎకోసిస్టమ్‌కు ముప్పు అని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. యాపిల్ ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ప్రభుత్వ ఆదేశాలను కూడా పాటించట్లేదు. శామ్సంగ్, షావోమీ వంటి ఆండ్రాయిడ్ తయారీదారులు ఈ ఆర్డర్‌ను సమీక్షిస్తున్నప్పటికీ ముందస్తు సంప్రదింపులు లేకుండానే ఆదేశాలు రావడంపై పరిశ్రమలో అసంతృప్తి వ్యక్తమవుతోంది.ఇదీ చదవండి: గూగుల్ ట్రెండ్స్‌లో టాప్‌లో నీతా అంబానీ.. -
తెలంగాణ సర్కార్‌కు పట్టని కేఆర్ఎంబీ ఆదేశాలు
సాక్షి, గుంటూరు: నాగార్జునసాగర్‌లో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయాలంటూ తెలంగాణకు కేఆర్ఎంబీ ఆదేశాలు జారీ చేసిందని సాగర్ ఈఈ శ్రీహరి తెలిపారు. కేఆర్ఎంబీ ఆదేశాలను తెలంగాణ సర్కార్ పట్టించుకోవడం లేదన్నారు. ‘‘విద్యుత్ ఉత్పత్తి కోసం నాగార్జునసాగర్‌లో రోజుకు 30 వేల క్యూసెక్కులను టీఎస్ సర్కార్ వాడుకుంటోంది. ప్రాజెక్టులో నీరు నిండుగా ఉన్నపుడు విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. కానీ ఇప్పుడు ప్రాజెక్టులో తక్కువగా నీరు ఉన్నా తెలంగాణ అధికారులు విద్యుత్ పంపిణీ చేపట్టారని’’ ఆయన పేర్కొన్నారు. దీని వల్ల ప్రకాశం, గుంటూరు జిల్లాలో రైతులు ఇబ్బందులు పడతారని శ్రీహరి తెలిపారు. -
డిస్ఇన్ఫెక్షన్ టన్నెల్స్‌ని నిషేధించాలి
న్యూఢిల్లీ: మనుషులపై రసాయనాలు చల్లే డిస్ఇన్ఫెక్షన్ టన్నెల్స్‌ని నిషేధిస్తూ ఒక నెల రోజుల్లోగా ఆదేశాలు జారీచేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. మనుషులు కృత్రిమ అతినీలలోహిత కిరణాలకు గురికాకుండా మార్గదర్శకాలు విడుదల చేయాలని సూచించింది. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్–2005 లాంటి చట్టాల ద్వారా కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు చేపట్టాలంది. మనుషులను అతి నీలలోహిత కిరణాలకు గురిచేయడం, డిస్ఇన్ఫెక్షన్ టన్నెల్స్‌ని వాడటం లాంటి చర్యలను నిషేధించాలని కోరుతూ గుర్ సిమ్రాన్ నరూలా దాఖలు చేసిన పిటిషన్‌ని కోర్టు విచారించింది. ఇప్పటికే మనుషులపై క్రిమిసంహారాలను చల్లరాదని, డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ మార్గదర్శకాలను విడుదల చేసినట్టు కోర్టు తన తీర్పులో పేర్కొంది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని నెలరోజుల్లోగా ఈ ప్రక్రియని ముగించాలని కేంద్రానికి కోర్టు సూచించింది. ‘నాలుగ్గోడల మధ్య అలా దూషిస్తే నేరం కాదు’ న్యూఢిల్లీ: షెడ్యూల్ కులాలు, తెగలకు చెందిన ఒక వ్యక్తిని దూషించడానికి సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇంట్లోని నాలుగు గోడల మధ్య, ఎలాంటి సాక్షులు లేకుండా కులం పేరుతో దూషించడం నేరం కిందకు రాదని పేర్కొంది. బాధితుడు/ బాధితురాలు షెడ్యూల్ కులాలు, తెగలకు చెందిన వ్యక్తి అయినప్పుడే.. కులం పేరుతో జరిగే అన్ని రకాలైన అవమానాలు, దూషణలను ఎస్సీ, ఎస్టీ చట్టం కింద నేరాలుగా భావిస్తామని తెలిపింది. సమాజంలోని అణగారిన వర్గానికి చెందిన వ్యక్తిని ఎవరైనా బహిరంగంగా అగౌరవపరచడం, అవమానించడం, వేధించడం వంటివి ఎస్సీ, ఎస్టీ చట్టం కింద నేరంగా చూడాలని జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు, జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ అజయ్ రస్తోగిల ధర్మాసనం తెలిపింది. ఉత్తరాఖండ్‌కు చెందిన హితేశ్ వర్మ తన ఇంట్లోకి వచ్చి కులం పేరుతో దూషించాడంటూ ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో ఆ రాష్ట్ర హైకోర్టు అతడిపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేయాలని ఆదేశించింది. దీంతో వర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఈ సందర్భంగా ధర్మాసనం పైవ్యాఖ్యలు చేస్తూ..ఆ కేసును కొట్టేసింది. -
ఆర్థిక పథకం మార్గదర్శకాల సవరణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని 10 బీసీ సమాఖ్యల ద్వారా ఆర్థిక సహా యం అందించే పథకం మార్గదర్శకాలను సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రజక, నాయీ బ్రాహ్మణ, సగర/ఉప్పర, వాల్మీకి/బోయ, వడ్డెర, కృష్ణబలిజ/పూసల, భట్రాజ, మేదర, విశ్వబ్రాహ్మణ, కుమ్మరి శాలివాహన సహకార సంఘాల సమాఖ్య లిమిటెడ్‌ల ద్వారా ఆయా పథకాల కింద వ్యక్తిగత రుణాలు పొందేందుకు 21-40 ఏళ్ల మధ్యనున్న వయసును 21-55 ఏళ్లకు పెంచింది. వ్యవసాయ అనుబంధ రంగాల్లో వయోపరిమితిని 60 ఏళ్లకు పెంచింది. ఈ సమాఖ్యల ద్వారా బృందాలుగా (గ్రూపులుగా) రుణం పొందేవారికి ఎటువంటి నిబంధనలు వర్తించవు. వీరంతా ఆహార భద్రతా కార్డులు/ఆధార్ కార్డులు అప్లోడ్ చేసుకోవాలి. ఈ సమాఖ్యల అనుబంధ సొసైటీలకే ఆర్థిక సాయం అందిస్తారు. ఇవన్నీ సహకార సంఘాల సొసైటీల చట్టం-1964 కింద రిజిస్టర్ చేసుకుని పదిహేను మంది సభ్యులకు మించకుండా ఉండాలి. ఒక్కో సొసైటీకి 7.5 లక్షల రూపాయల చొప్పున (ఒక్కో సభ్యుడికి రూ. 50 వేల చొప్పున 15 మందికి) ఇందులో 50 శాతం సబ్సిడీగా, మిగిలిన 50 శాతాన్ని బ్యాంకు రుణంగా అందజేస్తారు. ఈ మేరకు శుక్రవారం రాష్ర్ట బీసీ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి టి.రాధ ఉత్తర్వులు జారీ చేశారు.


