డిస్‌ఇన్ఫెక్షన్‌ టన్నెల్స్‌ని నిషేధించాలి

SC asks Centre to issue order on regulating use of disinfection tunnels - Sakshi

కేంద్రాన్ని ఆదేశించిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: మనుషులపై రసాయనాలు చల్లే డిస్‌ఇన్‌ఫెక్షన్‌ టన్నెల్స్‌ని నిషేధిస్తూ ఒక నెల రోజుల్లోగా ఆదేశాలు జారీచేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. మనుషులు కృత్రిమ అతినీలలోహిత కిరణాలకు గురికాకుండా మార్గదర్శకాలు విడుదల చేయాలని సూచించింది. డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌–2005 లాంటి చట్టాల ద్వారా కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు చేపట్టాలంది. మనుషులను అతి నీలలోహిత కిరణాలకు గురిచేయడం, డిస్‌ఇన్‌ఫెక్షన్‌ టన్నెల్స్‌ని వాడటం లాంటి చర్యలను నిషేధించాలని కోరుతూ గుర్‌ సిమ్రాన్‌ నరూలా దాఖలు చేసిన పిటిషన్‌ని కోర్టు విచారించింది. ఇప్పటికే మనుషులపై క్రిమిసంహారాలను చల్లరాదని, డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ మార్గదర్శకాలను విడుదల చేసినట్టు కోర్టు తన తీర్పులో పేర్కొంది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని నెలరోజుల్లోగా ఈ ప్రక్రియని ముగించాలని కేంద్రానికి కోర్టు సూచించింది.

‘నాలుగ్గోడల మధ్య అలా దూషిస్తే నేరం కాదు’
న్యూఢిల్లీ: షెడ్యూల్‌ కులాలు, తెగలకు చెందిన ఒక వ్యక్తిని దూషించడానికి సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇంట్లోని నాలుగు గోడల మధ్య, ఎలాంటి సాక్షులు లేకుండా కులం పేరుతో దూషించడం నేరం కిందకు రాదని పేర్కొంది. బాధితుడు/ బాధితురాలు షెడ్యూల్‌ కులాలు, తెగలకు చెందిన వ్యక్తి అయినప్పుడే.. కులం పేరుతో జరిగే అన్ని రకాలైన అవమానాలు, దూషణలను ఎస్సీ, ఎస్టీ చట్టం కింద నేరాలుగా భావిస్తామని తెలిపింది. సమాజంలోని అణగారిన వర్గానికి చెందిన వ్యక్తిని ఎవరైనా బహిరంగంగా అగౌరవపరచడం, అవమానించడం, వేధించడం వంటివి ఎస్సీ, ఎస్టీ చట్టం కింద నేరంగా చూడాలని జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వరరావు, జస్టిస్‌ హేమంత్‌ గుప్తా, జస్టిస్‌ అజయ్‌ రస్తోగిల ధర్మాసనం తెలిపింది. ఉత్తరాఖండ్‌కు చెందిన హితేశ్‌ వర్మ తన ఇంట్లోకి వచ్చి కులం పేరుతో దూషించాడంటూ ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో ఆ రాష్ట్ర హైకోర్టు అతడిపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేయాలని ఆదేశించింది. దీంతో వర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఈ సందర్భంగా ధర్మాసనం పైవ్యాఖ్యలు చేస్తూ..ఆ కేసును కొట్టేసింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

11-05-2021
May 11, 2021, 05:52 IST
న్యూఢిల్లీ: కరోనా టీకా పొందాలంటే కోవిన్‌ పోర్టల్‌ లేదా ఆరోగ్యసేతు యాప్‌లో పేర్లు, వివరాలు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. అయితే,...
11-05-2021
May 11, 2021, 05:10 IST
సాక్షి, అమరావతి: కరోనా నేపథ్యంలో గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందికి, వలంటీర్లకు బయో మెట్రిక్‌ హాజరు నుంచి రాష్ట్ర ప్రభుత్వం...
11-05-2021
May 11, 2021, 05:07 IST
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్ష ఎన్నికలు వాయిదాపడ్డాయి. దేశంలో కోవిడ్‌ సంక్షోభ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కాంగ్రెస్‌ అధ్యక్ష...
11-05-2021
May 11, 2021, 04:56 IST
ముంబై: చేసిన సాయం చెప్పుకోవడం తనకు ఇష్టం ఉండదని ప్రఖ్యాత బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌(78) స్పష్టం చేశారు. దేశమంతటా...
11-05-2021
May 11, 2021, 04:45 IST
సాక్షి, అమరావతి: వేసవిలో ఇష్టంగా తీసుకునే శీతల పానీయాలు, ఐస్‌క్రీమ్‌లకు వినియోగదారులు దూరంగా ఉంటున్నారు. కరోనా సెకండ్‌ వేవ్‌ విస్తరిస్తున్న...
11-05-2021
May 11, 2021, 04:27 IST
ముంబై: ప్రభుత్వరంగ బ్యాంకుల సేవలు (పీఎస్‌బీలు) కొత్త పుంతలు తొక్కనున్నాయి. కస్టమర్‌ తన పనుల కోసం బ్యాంకు శాఖ వరకు...
11-05-2021
May 11, 2021, 04:21 IST
న్యూఢిల్లీ: కోవిడ్‌–19 మహమ్మారి విస్తృతి కారణంగా రిటైల్‌ రంగం తీవ్రంగా దెబ్బతింది. ఈ నేపథ్యంలో షాపింగ్‌ మాల్స్‌ ఆదాయం గత...
11-05-2021
May 11, 2021, 04:00 IST
శృంగవరపుకోట రూరల్‌: అన్ని దేశాలు కరోనా బారినపడి అల్లాడిపోతుంటే.. విజయనగరం జిల్లా ముషిడిపల్లి పంచాయతీ పరిధిలోని గిరిజనులు ఊరు దాటకుండా...
11-05-2021
May 11, 2021, 03:48 IST
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజలను కోవిడ్‌ నుంచి విముక్తి కల్పించేందుకు విదేశాల్లో ఎక్కడైనా వ్యాక్సిన్‌ లభిస్తే కొనుగోలు చేసేందుకు రాష్ట్ర...
11-05-2021
May 11, 2021, 03:45 IST
సాక్షి, అమరావతి: కోవిడ్‌ బాధితులకు తక్షణం సేవలందించేలా 104 కాల్‌ సెంటర్‌ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని, ఈ వ్యవస్థ...
11-05-2021
May 11, 2021, 03:33 IST
సాక్షి, అమరావతి: కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తుండటంతో దేశవ్యాప్తంగా పది రోజులుగా అత్యధిక పాజిటివిటీ రేటు నమోదవుతోంది. సగటున రోజుకు...
11-05-2021
May 11, 2021, 03:25 IST
సాక్షి, హైదరాబాద్‌: గోరుచుట్టుపై రోకటి పోటు అంటే ఇదేనేమో! ఒకవైపు రోజూ లక్షల మంది కోవిడ్‌ బారిన పడి అల్లాడుతుంటే.....
11-05-2021
May 11, 2021, 03:21 IST
సాక్షి, అమరావతి: కోవిడ్‌ వ్యాక్సినేషన్‌కు సంబంధించి ప్రస్తుతం నెలకొన్న వాస్తవ పరిస్థితులను ప్రజలకు స్పష్టంగా చెప్పాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి...
11-05-2021
May 11, 2021, 02:45 IST
సాక్షి, అమరావతి, న్యూఢిల్లీ: కరోనా టీకాల ఉత్పత్తి సంస్థల నుంచి తమకు అవసరమైన మేరకు వ్యాక్సిన్‌ డోసులను కొనుగోలు చేసే...
11-05-2021
May 11, 2021, 02:27 IST
సాక్షి, హైదరాబాద్‌: రెండో డోసు టీకా కోసం రాష్ట్రవ్యాప్తంగా జనం వ్యాక్సినేషన్‌ కేంద్రాలకు పోటెత్తారు. సోమవారం పొద్దున ఆరు గంటల...
11-05-2021
May 11, 2021, 02:04 IST
సాక్షి, హైదరాబాద్‌: కరోనా వ్యాప్తి నేపథ్యంలో వైద్య సేవలను మరింత విస్తృతం చేసేందుకు తాత్కాలిక పద్ధ తిలో వైద్య నిపుణులను...
11-05-2021
May 11, 2021, 01:41 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు లాక్‌డౌన్‌ విధించే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. రంజాన్‌ పండుగ (శుక్రవారం)...
11-05-2021
May 11, 2021, 01:15 IST
కరోనా మహమ్మారి రెండో దశలో కేసులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఊపిరితిత్తులపై ఇది ఎక్కువగా ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో కోవిడ్‌...
10-05-2021
May 10, 2021, 21:00 IST
చండీగఢ్‌: క‌రోనా మ‌హ‌మ్మారితో జీవ‌నోపాధి కోల్పోయి ఇబ్బందులు ప‌డే పేదలను ఆదుకునేందుకు హరియాణా ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ క్రమంలో దారిద్య్ర...
10-05-2021
May 10, 2021, 20:44 IST
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో ఇప్పటివరకు  73,00,460 మందికి వ్యాక్సిన్‌ వేయటం జరిగింది. 73,49,960 కోవిషీల్డ్, కోవాగ్జిన్ డోసులు ఏపీకి...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top