తెలుగు నటుడు, నిర్మాత బండ్ల గణేశ్‌కి ఒంగోలు కోర్ట్ ఏడాది జైలుశిక్ష విధించింది. ఇదే కేసులో రూ.95 లక్షల జరిమానా కూడా వేసింది. ఈ మేరకు బుధవారం తీర్పు వెలువరించింది. గతంలో మద్దిరాలపాడుకి చెందిన జెట్టి వెంకటేశ్వరరావుకి బండ్ల గణేశ్ రూ.95 లక్షలు బాకీ ఉన్నాడు. దీన్ని తీర్చే క్రమంలో తన నిర్మాణ సంస్థ పరమేశ్వర ఆర్ట్స్ నుంచి ఇంతే మొత్తం చెక్ ఇచ్చాడు. కానీ ఇది బౌన్స్ కావడంతో బాధితుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా గణేశ్‌కి జైలుశిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది.
(ఇదీ చదవండి: వారణాసి.. ఏదో ఒకటి తేల్చాల్సిందే)
ఈ కేసు తీర్పుపై బండ్ల గణేశ్ స్పందించాడు. ఈ మేరకు ట్వీట్ చేశాడు. 'భారత రాజ్యాంగం, న్యాయవ్యవస్థ, పోలీసు వ్యవస్థలపై నాకు అపారమైన గౌరవం ఉంది. మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి వ్యవస్థకు ఒక ప్రత్యేకమైన గౌరవం, బాధ్యత ఉన్నాయి. జిల్లా కోర్టు నుంచి హైకోర్టు, అక్కడి నుంచి సుప్రీంకోర్టు వరకు న్యాయం కోరేందుకు రాజ్యాంగం మనకు అవకాశం కల్పించింది. న్యాయవ్యవస్థపై పూర్తి విశ్వాసంతో, చట్టాన్ని గౌరవిస్తూ ముందుకు సాగడమే నా నమ్మకం' అని రాసుకొచ్చాడు.
(ఇదీ చదవండి: మూడేళ్ల తర్వాత అనుమతి.. సీఎంకి విజయ్‌కి ధనుష్ థ్యాంక్స్)
భారత రాజ్యాంగం, న్యాయవ్యవస్థ, పోలీసు వ్యవస్థలపై నాకు అపారమైన గౌరవం ఉంది. మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి వ్యవస్థకు ఒక ప్రత్యేకమైన గౌరవం, బాధ్యత ఉన్నాయి. జిల్లా కోర్టు నుంచి హైకోర్టు, అక్కడి నుంచి సుప్రీంకోర్టు వరకు న్యాయం కోరేందుకు రాజ్యాంగం మనకు అవకాశం కల్పించింది. న్యాయవ్యవస్థపై పూర్తి విశ్వాసంతో, చట్టాన్ని గౌరవిస్తూ ముందుకు సాగడమే నా నమ్మకం. 🙏
— BANDLA GANESH. (@ganeshbandla) November 18, 2026


