సార్‌... టార్చర్‌ పెడుతున్నారండి! | Attorney General for the Central Government Venkataramani | Sakshi
Sakshi News home page

సార్‌... టార్చర్‌ పెడుతున్నారండి!

Nov 17 2026 7:27 AM | Updated on Nov 17 2026 7:27 AM

Attorney General for the Central Government Venkataramani

న్యూఢిల్లీ: ‘‘జడ్జిగారు.. అర్ధరాత్రిళ్లు ఫోన్‌ చేస్తున్నారు సార్‌.. నల్లాల్లో నీళ్లు రావట్లేదంటూ కంప్లెయింట్లు’’ఈ మాటలన్నది ఎవరో తెలుసా...? సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వపు అటార్నీ జనరల్‌ ఆర్‌.వెంకటరమణి. ‘‘ఈ టార్చర్‌ భరించలేకున్నాను. నన్ను ఈ కేసులో కోర్టు రిసీవర్‌గా ననున తప్పించండి’’అని కూడా ఆయన సోమవారం జస్టిస్‌ జేబీ పర్డీవాలా, జస్టిస్‌ కె.వినోద్‌ చంద్రన్‌లతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్‌ను వేడుకున్నారు. ఢిల్లీలో ఆమ్రపాలి గ్రూపు నిర్మించిన అపార్ట్‌మెంట్లకు సంబంధించి నడుస్తున్న కోర్టు కేసు విచారణ సందర్భంగా చోటు చేసుకున్న ఆసక్తికర పరిణామం ఇది. 

2017లో అమ్రపాలి నుంచి అపార్ట్‌మెంట్లు కొన్న సుమారు వంద మంది ఈ కేసు వేశారు. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఆమ్రపాలి సంస్థ దివాళా తీసిందంటూ ఎన్‌సీఎల్‌టీ మెట్లు ఎక్కనున్న నేపథ్యంలో తమ ప్రయోజనాలన కాపాడాలని వీరు కోర్టును అభ్యరి్థస్తున్నారు. భవన నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయిన నేపథ్యంలో సుప్రీంకోర్టు 2019లో ఆర్‌.వెంకటరమణిని ధర్మకర్తగా నియమించింది. నిర్మాణ పనులను ఎన్‌బీసీసీకి అప్పగించింది. 

ఈ నేపథ్యంలో సోమవారం కేసు విచారణ జరుగుతున్న సందర్భంగా ఆర్‌.వెంకట రమణి తన ఇబ్బందులను వెళ్లగక్కారు. పనుల ఒత్తిడి ఎక్కువగా ఉన్నందున ఈ కేసులో కోర్టు రిసీవర్‌గా తనను తప్పించాలని కోరారు. అయితే దీనికి జస్టిస్‌ జేబీ పారీ్టవాలా అంగీకరించలేదు సరికదా... తాను రిటైర్‌ అయ్యే రోజు వరకూ కొనసాగాలని విజ్ఞప్తి చేశారు.. ‘‘తప్పుకుంటారా? మీ స్థానంలో ఎవరు వస్తారు? ఇప్పటివరకూ మీరు చాలా చేశారు. 

మేమైనా డబ్బులు కట్టి ఇళ్ల కోసం కష్టాల్లో పడ్డ వారిని ఆదుకునేందుకు చేస్తున్నాం. కొంతమంది ఇబ్బంది పెట్టే వాళ్లు ఉండవచ్చు. వాళ్ల సంగతి మేం చూసుకుంటాం. మీరు కనీసం ఆగస్టు 11, 2030 వరకైనా తప్పుకోవద్దు. ఆగస్టు 12, 2030 తరువాత తప్పుకోవచ్చు’’అని వ్యాఖ్యానించారు అటార్నీ జనరల్‌ను ఎవరూ వ్యక్తిగత సమస్యల కోసం సంప్రదించరాదని గృహ యజమానుల తరఫు న్యాయవాదికి స్పష్టం చేశారు. జస్టిస్‌ పార్టీ వాలా ఆగస్టు 11న పదవీ విరమణ చేస్తున్నారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement