డీలిమిటేషన్ బిల్లుపై కీలక అడుగు | Central Govt likely to call special Parliament session on delimitation | Sakshi
Sakshi News home page

డీలిమిటేషన్ బిల్లుపై కీలక అడుగు

Nov 12 2026 3:14 PM | Updated on Nov 12 2026 3:18 PM

Central Govt likely to call special Parliament session on delimitation

సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు ముందే డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ రెండు బిల్లులకు పార్లమెంట్‌లో అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీ సాధించగలమన్న ధీమాతో కేంద్రం ఉన్నట్లు సమాచారం.

గతంలోనే లోక్‌సభలో ఓటింగ్ సందర్భంగా ఆమోదం పొందని డీలిమిటేషన్ బిల్లును మరోసారి పార్లమెంట్ ముందుకు తీసుకురావాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. జనాభా ప్రాతిపదికన రాష్ట్రాలకు లోక్‌సభ స్థానాలను పునర్విభజించే ప్రతిపాదనపై విపక్షాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. అంతేకాదు మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుపెట్టుకుని డీలిమిటేషన్ బిల్లును ఆమోదింపజేసుకోవాలని కేంద్రం చూస్తోందని కూడా విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

ఇక మరోవైపు ఎస్‌ఐఆర్‌ (SIR) ప్రక్రియపై ప్రధాని మోదీతో చర్చకు రావాలంటూ రాహుల్ గాంధీ చేసిన సవాలుపైనా ఈ ప్రత్యేక సమావేశాల్లో చర్చ జరిగే అవకాశం ఉందని సమాచారం. దీనిపై రాహుల్ అంగీకరిస్తే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ అంశాన్ని ప్రస్తావించే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

అయితే డీలిమిటేషన్ విషయంలో బీజేపీ ఇతర పార్టీలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ ఆరోపించారు. శివసేన, డీఎంకే, ఎన్సీపీ వంటి పార్టీల మద్దతు కూడగట్టిన తర్వాతే బిల్లును ముందుకు తీసుకురావాలని బీజేపీ చూస్తోందని ఆయన విమర్శించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కావడానికి కొద్ది రోజులే మిగిలి ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

ఇదీ చదవండి: లోకల్ రైలులో మహిళపై దారుణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement