లోకల్ రైలులో మహిళపై దారుణం | Woman Objects Men To Bad Touch, Pushed Off Mumbai Local, Loses Arm | Sakshi
Sakshi News home page

లోకల్ రైలులో మహిళపై దారుణం

Nov 12 2026 2:49 PM | Updated on Nov 12 2026 2:49 PM

Woman Objects Men To Bad Touch, Pushed Off Mumbai Local, Loses Arm

సాక్షి, ముంబై: లోకల్ రైలులో తనను అసభ్యంగా తాకడాన్ని ప్రశ్నించిన ఓ మహిళపై ఓ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. అంతేకాదు ఆమెను రైలు నుంచి తోసేయడంతో సదరు మహిళ తీవ్రంగా గాయపడి తన ఎడమ చేతిని కోల్పోయింది. దాంతోపాటు తలకు తీవ్ర గాయం అవ్వడంతో ఆ మహిళకు 16 కుట్లు కూడా పడ్డాయి. ఈ ఘటన ముంబైలోని నాయ్‌గావ్ రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకుంది.

బోరివలి నుంచి విరార్‌కు వెళ్తున్న లోకల్ రైలులో బాధితురాలిని ఓ వ్యక్తి అసభ్యంగా తాకినట్లు సమాచారం. దీంతో ఆగ్రహించిన ఆ మహిళ చెప్పుతో అతడిపై దాడి చేసింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కాసేపటికి రైలు నాయ్‌గావ్ స్టేషన్‌కు చేరుకున్న తర్వాత నిందితుడు ఆమెను ఆ రైలు నుంచి తోసేశాడు. దీంతో రెండు బోగీల మధ్య పడిపోయిన ఆమె తిరిగి ప్లాట్‌ఫామ్‌పైకి ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగా రైలు కదిలింది. ఈ క్రమంలో ఆమె ఎడమ చేయి రైలు చక్రాల కింద పడి తన మోచేతి సమీపంలో తెగిపోయింది.

వెంటనే అక్కడున్న రైల్వే పోలీసులు, ప్రయాణికులు ఆమెను ప్లాట్‌ఫామ్‌పైకి చేర్చి ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ ఘటన అనంతరం పారిపోయిన నిందితుడిని పోలీసులు కొన్ని గంటల్లోనే అరెస్ట్ చేశారు. కాగా ఈ కేసులో హత్యాయత్నం సెక్షన్ 109ను చేర్చకపోవడంపై బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసుల దర్యాప్తుపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ విషయంపై మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) నేతలు జీఆర్పీ అధికారులను కలిసి ఫిర్యాదు చేయగా, సంబంధిత సెక్షన్లు చేర్చుతామని పోలీసులు హామీ ఇచ్చినట్లు సమాచారం.

ఇదీ చదవండి: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement