కోల్‌కతా: ఎయిర్ ఇండియా విమానంలో హైజాక్ హెచ్చరిక కలకలం రేపింది. విమానం హైజాక్ చేసే అవకాశం ఉందంటూ రాసిన ఓ లేఖ కలకలం సృష్టించింది. దీంతో అప్రమత్తమైన పైలట్ వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) అధికారులకు సమాచారం అందించారు. ఈ ఘటన బుధవారం ఉదయం కోల్‌కతా నుంచి మహారాష్ట్రలోని ముంబై వెళ్లేందుకు సిద్ధమైన ఎయిర్ ఇండియా విమానంలో చోటుచేసుకుంది.
విమానంలో అనుమానాస్పదంగా ఉన్న లేఖను గుర్తించిన వెంటనే పైలట్ అధికారులను అప్రమత్తం చేశారు. దీంతో విమానాన్ని ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా ఐసోలేషన్ బేకు తరలించారు. సమాచారం అందుకున్న భద్రతా సంస్థలు విమానంలో తనిఖీలు ప్రారంభించి, బెదిరింపు వెనుక ఉన్న కారణాలపై దర్యాప్తు చేపట్టాయి. హైజాక్ హెచ్చరికతో విమానాశ్రయంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. అయితే ఈ లేఖ ఎవరు రాశారు? విమానంలో ప్రమాదకర వస్తువులు ఏమైనా ఉన్నాయా? అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. భద్రతా తనిఖీలు, దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
A handwritten note warning of a possible hijack triggered a security scare aboard an Air India flight scheduled to travel from Kolkata, West Bengal, to Mumbai, Maharashtra, on Wednesday morning. The pilot immediately alerted Air Traffic Control (ATC) after the note was discovered inside the aircraft. The plane was moved to an isolation bay as security agencies launched an investigation into the threat. #AirIndia #HijackThreat #KolkataAirport #AviationNews #BreakingNews
— News18 (@CNNnews18) November 11, 2026
ఈ విషయాన్ని మపుసా పోలీస్ ఇన్‌స్పెక్టర్ అనంత్ గావోంకర్ ఏఎన్‌ఐ వార్తా సంస్థకు వెల్లడించారు. ఉదయం టేకాఫ్‌కు సిద్ధమవుతున్న సమయంలో విమానానికి బెదిరింపు హెచ్చరిక రావడంతో ముందస్తు జాగ్రత్తగా ఐసోలేషన్ బేకు తరలించినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న భద్రతా సంస్థల అధికారులు వెంటనే విమానం వద్దకు చేరుకుని ప్రామాణిక భద్రతా విధానాల ప్రకారం తనిఖీలు ప్రారంభించారని చెప్పారు. ప్రస్తుతం పరిస్థితిని సమీక్షిస్తున్నామని, మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని వెల్లడించారు.
Mapusa PI Anant Gaonkar tells ANI, "An Air India flight scheduled to operate from Kolkata to Mumbai was moved to the isolation bay this morning following a threat alert shortly before take-off. Security agencies immediately reached the spot and initiated checks as per standard operating procedures (SOP). The situation is being assessed, and further details are awaited."
— ANI (@ANI) November 11, 2026
ఇదీ చదవండి: టీఎంసీకి బిగ్ షాక్.. మమత సోదరుడు సంచలన వ్యాఖ్యలు


