అస్సాం రైలు ప్రమాదం ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. కోల్‌కతా నుంచి మిజోరంలోని ఐజ్వాల్ సమీపంలోని సైరాంగ్‌కు వెళ్తున్న కోల్‌కతా–సైరాంగ్ ఎక్స్‌ప్రెస్ రైలు అస్సాంలోని కామ్రూప్ మెట్రోపాలిటన్ జిల్లాలో డిగారు రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పిన సంగతి తెలిసిందే. బుధవారం ఉదయం 6.54 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.
45 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో లోకో పైలెట్ బ్రేక్ పైప్ (బీపీ) ప్రెజర్ తగ్గడం లేదని చెబుతున్న మాటలు వినిపిస్తున్నాయి. ‘ ప్రెజర్ తగ్గడం లేదు. సిగ్నల్ రెడ్‌లో ఉంది. ఎమర్జెన్సీ బ్రేక్ వేసినా పనిచేయడం లేదు’ అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పవర్ స్విచ్‌లను మార్చేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ‘ఏదీ పనిచేయడం లేదు’ అని చెబుతుండగానే రైలు ఏదో అడ్డంకిని ఢీకొట్టినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఆ సమయంలో కౌంటర్‌పై ఉన్న గాజు సీసా కిందపడిపోయింది.
*Indian Railways* At around 06:54 hrs on 11.11.2026, while Train No. 13125 Kolkata - Sairang Express was being received at Digaru Railway Station in Assam to give precedence to another train, *the Loco Pilot could not control the speed,* resulting in aderailment, https://t.co/mNwH9gqq3M
— Preeti Sompura (@sompura_preeti) November 11, 2026
ప్రమాద సమయంలో తాము ఎదుర్కొన్న పరిస్థితులను రైలు ప్యాంట్రీ కార్ మేనేజర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఉదయం 5 గంటల సమయంలో మేమంతా నిద్రపోతున్నాం. గువాహటి వరకు అంతా బాగానే ఉంది. అక్కడ రైలు ఆగింది. అనంతరం ప్రయాణం తిరిగి ప్రారంభమైంది. రైలు వేగంగానే వెళ్తోంది. డిగారు స్టేషన్ వద్దకు చేరుకోగానే వేగం కొద్దిగా తగ్గింది. ప్లాట్‌ఫామ్ దాటిన తర్వాత ఏదో శబ్దం వినిపించింది. ఆ శబ్దం ఏమిటో మాకు అర్థం కాలేదు.
కొద్ది మీటర్ల దూరం వెళ్లగానే ఇంజిన్ పట్టాలు తప్పినట్లు అనిపించింది. అయినప్పటికీ మరో కిలోమీటరు వరకు పట్టాలు తప్పిన స్థితిలోనే రైలు ముందుకు కదిలింది. నేను సీటు నుంచి మూడుసార్లు కిందపడ్డాను. రైలు తలుపులు తెరవలేకపోయాం. అందరం తీవ్ర ఆందోళనకు గురయ్యాం. సుమారు పది నిమిషాల తర్వాత రైలు ఆగిపోయింది. దేవుడి దయతో మేమంతా క్షేమంగా బయటపడ్డాం. లేదంటే ప్రాణాలతో ఉండేవాళ్లం కాదు. ప్రస్తుతం పవర్ కార్, ఇంజిన్ పూర్తిగా దెబ్బతిన్నాయి’ అని వివరించారు.
13125 #Kolkata - #Sairang Exp derails at #Digaru #Assam at 6:54 hrs today while received at Digaru to give precedence to another train As per LPs POV video, loco braking system not working for which this #TrainDerailment happens Seriously question raised today #IndianRailways https://t.co/uUAyvYPIXv
— Ansuman Satapathy (@TechAnsuman) November 11, 2026
ఇదీ చదవండి: ఎయిర్ ఇండియా విమానం హైజాక్ కలకలం


