టికెట్‌ లేనివారికి షాక్‌.. రైల్వేకు జరిమానాల జాక్‌పాట్‌! | South Central Railway Earns Record Rs 1. 18 Crore in One-Day Ticket Checking Drive | Sakshi
Sakshi News home page

టికెట్‌ లేనివారికి షాక్‌.. రైల్వేకు జరిమానాల జాక్‌పాట్‌!

Nov 7 2026 6:01 AM | Updated on Nov 7 2026 6:01 AM

South Central Railway Earns Record Rs 1. 18 Crore in One-Day Ticket Checking Drive

 ఒక్కరోజులోనే టికెట్‌ తనిఖీల ద్వారా రూ.1.18 కోట్లు 

సాక్షి, హైదరాబాద్‌: టికెట్‌ లేకుండా ప్రయాణం చేసేవారిపై దక్షిణమధ్య రైల్వే కొరడా ఝుళిపించింది. ఈనెల 5న ఒక్క రోజు నిర్వహించిన తనిఖీల్లోనే ప్రయాణికులపైన విధించిన జరిమానాల ద్వారా రూ.1.18 కోట్ల ఆదాయం లభించినట్లు అధికారులు తెలిపారు. దీపావళి, ఛత్‌ పండుగల దృష్ట్యా పెరిగిన రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ తనిఖీలను చేపట్టారు. దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమర్షియల్‌ మేనేజర్‌ ఇతి పాండే ఆదేశాల మేరకు సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్‌ డివిజన్‌లలో ఈ తనిఖీలు జరిగాయి. 

టికెట్‌ లేకుండా, లేదా నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణిస్తున్న వారిపై మొత్తం 11,150 కేసులు నమోదు చేశారు. ఈ ఏడాది జూన్‌లో జోన్‌ విభజన తర్వాత ఒకే రోజులో నమోదైన అత్యధిక టికెట్‌ తనిఖీ ఆదాయం ఇదేనని అధికారులు తెలిపారు. సాధారణంగా రోజువారీ టికెట్‌ తనిఖీల ద్వారా సగటున రూ.33.44 లక్షల ఆదాయం (సుమారు 4,373 కేసుల ద్వారా) లభిస్తున్నట్లు పేర్కొన్నారు. 

కానీ ఒకే రోజులో రూ.1.18 కోట్ల టికెట్‌ తనిఖీ ఆదాయాన్ని ఆర్జించి, జోన్‌ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించడం విశేషం. ఈ ఆదాయంలో సికింద్రాబాద్‌ డివిజన్‌ అత్యధికంగా రూ.1.02 కోట్లను సమ కూర్చి అగ్రస్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్‌ కుమార్‌ శ్రీవాస్తవ అధికారులు, టికెట్‌ తనిఖీ సిబ్బందిని అభినందించారు. అక్రమ ప్రయాణాలను నివారించడమే తమ లక్ష్యమన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement