breaking news
Ticket checking post
-
రైళ్లలో టీసీలకు కొత్త ‘లుక్కు’.. టెక్కు!
సాధారణంగా రైళ్లలో ప్రయాణికుల టికెట్లను తనిఖీ చేసే టీసీలంటే తెల్లక చొక్కా, నల్ల ప్యాంటు, పైన ఓ నల్లని కోటు వేసుకుని కనిపిస్తారు. కానీ పశ్చిమ రైల్వే ముంబై డివిజన్ పరిధిలోని టీసీలు మాత్రం కొత్త ‘లుక్కు’.. టెక్కుతో కనిపిస్తున్నారు. పశ్చిమ రైల్వే (వెస్ట్రన్ రైల్వే) పరిధిలోని ముంబై డివిజన్ రైలు టికెట్లను తనిఖీలో కొత్తదనానికి శ్రీకారం చుట్టింది. అత్యంత రద్దీగా ఉండే ముంబై రైళ్లలో టికెట్ తనిఖీ సాంకేతిక పరిజ్ఞానాన్ని పశ్చిమ రైల్వే అప్ గ్రేడ్ చేస్తోంది. ఇందులో భాగంగా టికెట్ తనిఖీ సిబ్బంది కోసం ప్రత్యేకంగా రూపొందించిన జాకెట్లను ప్రవేశపెట్టింది. ఈ జాకెట్లో ఇంటిగ్రేటెడ్ బాడీ కెమెరాతో పాటు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు ఉంచుకోవడం కోసం పాకెట్లు ఉంటాయి. పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రస్తుతం 30 జాకెట్లను సిబ్బందికి అందజేసింది. టీసీలు వీటిని ధరించి రైళ్లలో ప్రయాణికుల టికెట్లను తనిఖీ చేస్తున్నారు.జాకెట్ల ప్రత్యేకతలుటీసీలకు అందించిన కొత్త జాకెట్లను పలు ప్రత్యేకతలతో రూపొందించారు. విధుల్లో ఉన్న టీసీల వద్ద టికెట్లను తనిఖీ చేసే హ్యాండ్-హెల్డ్ టెర్మినల్స్, ఎలక్ట్రానిక్ ఫేర్ కలెక్షన్ మెషీన్లు, వాయిస్ యాంప్లిఫైయర్లు ఉంటాయి. వీటిని తమతో తీసుకెళ్లడానికి టీసీలు ఇబ్బందులు పడుతుంటారు. ఆ ఇబ్బందులు లేకుండా వీటిని పెట్టుకోవడానికి ఈ జాకెట్లలో ప్రత్యేక జేబులు ఇచ్చారు. అలాగే హెడ్ సెట్ పెట్టుకునేందుకూ ప్రత్యేక ఏర్పాటు ఉంది.ఇక కొత్త జాకెట్ ప్రధాన ఫీచర్లలో ఒకటి దాని ఇంటిగ్రేటెడ్ బాడీ కెమెరా. టికెట్ తనిఖీ సిబ్బంది, ప్రయాణీకుల మధ్య పరస్పర చర్యలకు మరింత పారదర్శకత, జవాబుదారీతనాన్ని తీసుకురావడానికి ఈ కెమెరా ఉద్దేశం. టికెట్ తనిఖీ సమయంలో టీసీలు, ప్రయాణికుల మధ్య జరుగుతున్నదంతా ఈ బాడీ కెమెరా రికార్డ్ చేస్తుంది. దీంతో సిబ్బంది చేతివాటం ప్రదర్శించడం గానీ, ప్రయాణికులు దురుసుగా ప్రవర్తించడం గానీ కట్టడి చేసేందుకు వీలవుతుంది. అంటే ‘ఒకే దెబ్బకు రెండు పిట్టలు’ అన్న మాట!ఈ ప్రయోగాత్మక చొరవ విజయవంతమైతే ముంబై డివిజన్ వ్యాప్తంగా మరింత మంది టికెట్ తనిఖీ సిబ్బందికి ఈ జాకెట్లను అందించడాన్ని వెస్ట్రన్ రైల్వే పరిగణించవచ్చు.🚨 Western Railway ticket-checking staff get new jackets with integrated bodycam technology. https://t.co/zHVNCA0zkO— Indian Tech & Infra (@IndianTechGuide) October 8, 2026 -
టికెట్ల తనిఖీకి కొత్త సాంకేతికత
సాక్షి, హైదరాబాద్: డిజిటల్ ఇండియాలో భాగంగా దక్షిణ మధ్య రైల్వే మరొక మైలు రాయిని అధిగమించింది. రైలు ప్రయాణంలో హ్యాండ్–హెల్డ్ టెర్మినల్స్ (హెచ్‌హెచ్‌టీ)ను ఉపయోగించు కుని టికెట్లను తనిఖీచేసే నూతన వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. ప్రయాణికుల వివరాలు, బెర్తుల వివరాలు తెలుసుకోవడానికి, స్టేషన్ స్టేషన్‌కు మధ్య ఏర్పడే ఖాళీ బెర్తులను ప్రయాణికులకు కేటాయించడానికి ఇది ఉపయోగపడనుంది. హెచ్‌హెచ్‌టీ వ్యవస్థను దేశవ్యాప్తంగా 51 రాజధాని, శతాబ్ధి ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రయోగాత్మకంగా అమలు చేశారు. ప్రస్తుతం దీన్ని దక్షిణ మధ్య రైల్వే పరిధిలో అమలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సికింద్రాబాద్–పుణే శతాబ్ధి ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్–హజ్రాత్ నిజాముద్దీన్ రాజధాని ఎక్స్‌ప్రెస్, చెన్నై సెంట్రల్–హజ్రాత్ నిజాముద్దీన్, బెంగళూర్–హజ్రాత్ నిజాముద్దీన్ ఎక్స్‌ప్రెస్‌లలో పనిచేసే తనిఖీ సిబ్బందికి గురువారం 40 హెచ్‌హెచ్‌టీ పరికరాలను రైల్వే అందజేసింది. -
రైల్వే టిక్కెట్ చెకింగ్ పోస్టుల భర్తీకి ఒత్తిడి తేవాలి
గుంతకల్లు, న్యూస్‌లైన్: గుంతకల్లు డివిజన్లో దీర్ఘ కాలంగా ఖాళీగా ఉన్న టిక్కెట్ చెకింగ్ పోస్టుల భర్తీకి రైల్వే బోర్డుపై ఒత్తిడి పెంచాలని దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్(ఎస్సీఆర్ఎంయూ) డివిజన్ కార్యదర్శి కే.కళాధర్ పిలుపునిచ్చారు. స్థానిక రైల్వే క్రీడా మైదానం సమీపంలో ఉన్న యూనియన్ కార్యాలయంలో జరిగిన స్టేషన్ బ్రాంచ్ సర్వసభ్య సమావేశానికి సదరు చైర్మన్ కే.బాబురావు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా కళాధర్, డివిజన్ వైస్ ప్రెసిడెంట్ ఫళణిస్వామి, కోశాధికారి ప్రకాష్‌బాబు, ఏడీఎస్‌లు కేఎండీ గౌస్, ఇబ్రహీమ్ఖాన్, శ్రీనివాసులు, జయంత్‌కుమార్ హాజరయ్యారు. తొలుత స్టేషన్ బ్రాంచ్ సెక్రెటరీ బాలాజీ సింగ్ బుకింగ్ ఆఫీస్, రిజర్వేషన్ ఆఫీస్‌లలో రైల్వే ఉద్యోగులు, కార్మికులు, గార్డ్స్, ఏఎస్‌ఎంలు, ఎస్‌అండ్‌టీ విభాగంలోని ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను కే.కళాధర్ దృష్టికి తెచ్చారు. చితాపూర్ స్టేషన్లో రన్నింగ్ రూమ్స్‌లో గూడ్స్ గార్డ్స్ పడుతునన ఇబ్బందులను డివిజన్ అధికారులతో చర్చించి వెంటనే పరిష్కరించేలా ఒత్తిడి తేవాలని కోరారు. ఇంటర్ సిటీ ప్యాసింజర్ రైలులో గుంతకల్లుకు చెందిన స్లీపర్స్ టీటీఈలను కడప వరకు మాత్రమే అనుమతించాలని వారు కోరారు. కే.కళాధర్ మాట్లాడుతూ వాడి స్టేషన్లో టీటీఈలకు వసతి గృహాలు లేవని, వాటిని వెంటనే ఏర్పాటు చేయాలని డీఆర్ఎంను కోరుతామన్నారు. గుంతకల్లు రైల్వే డివిజన్లో ఖాళీగా ఉన్న 170 టిక్కెట్ చెకింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీటీఈలు, గార్డ్స్, ఎఎస్ఎంలు, ఎస్ అండ్ టీ విభాగం పాయింట్స్ మెన్, కమర్షియల్ క్లర్కులు పాల్గొన్నారు. స్టేషన్ బ్రాంచ్ ఆఫీస్ బేరర్స్ నూతన కమిటీ ఎన్నిక సమావేశానంతరం ఎస్సీఆర్ఎంయూ గుంతకల్లు రైల్వే డివిజన్ స్టేషన్ బ్రాంచ్ ఆఫీస్ బేరర్స్ కమిటీ చైర్మన్‌గా కే.బాబురావు, వైఎస్ చైర్మన్లుగా పీ.జాఫర్‌ఖాన్, జీ.రమేష్‌బాబు, కే.నగేష్‌కుమార్, ప్రంతోష్కుమార్, సెక్రెటరీగా బీ.బాలాజీ సింగ్, అసిస్టెంట్ సెక్రెటరీలుగా ఎన్.గురునాథ్, జే.భాస్కర్, ఎన్ఏఎస్ చారి, ట్రెజరర్‌గా జీఎం బాషా, ఆర్గనైజింగ్ సెక్రెటరీలుగా సుధీర్‌కుమార్, రామాంజినేయులును ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు కళాధర్ తెలిపారు. ఈ సందర్భంగా గుంతకల్లు రైల్వే డివిజన్లో పని చేస్తూ యూత్ కమిటీ లీడర్‌గా ఎన్నికైన జాఫర్‌ఖాన్, ఎస్సీఆర్ ఈసీసీఎస్ డెరైక్టర్‌గా ఎంపికైన దొరైరాజు భూషణంను సన్మానించారు. డివిజనల్ సెక్రెటరీ కే.కళాధర్ వీరిద్దరికి పూలమాలలు వేసి సత్కరించారు.


