విశాఖపట్నం: యువతులను అల్లరి పెట్టబోయిన ఆకతాయిలు చివరికి వీడియో ఆధారంగా పోలీసులకు చిక్కారు. ఈ నెల 2వ తేదీ రాత్రి ఎన్ఏడీ జంక్షన్ శాంతినగర్‌కు చెందిన ఇద్దరు యువతులు స్కూటీపై సీఎంఆర్ షాపింగ్ మాల్ నుంచి తిరిగి వస్తుండగా భాష్యం స్కూల్ సమీపంలో గ్లామర్ బైక్‌పై వస్తున్న బుచ్చిరాజుపాలెం కరాసాకు చెందిన గణేష్ సంతోష్ గౌతమ్ వారిని అసభ్యంగా దూషిస్తూ, అసభ్యకరంగా ప్రవర్తించారు.
ప్రమాదకరంగా బైక్ నడుపుతూ భయభ్రాంతులకు గురిచేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఆ యువతులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. దీనిపై స్పందించిన సీపీ శంఖబ్రత బాగ్చి ఆదేశాలతో ఎయిర్‌పోర్టు పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. సీఐ శంకరనారాయణ పర్యవేక్షణలో బాధితులను గుర్తించి, వారి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టారు. బుధవారం గణేష్ సంతోష్‌లను అదుపులోకి తీసుకోగా, గౌతమ్ కోసం గాలిస్తున్నారు. ట్రిపుల్ రైడింగ్‌పై మోటారు వాహనాల చట్టం ప్రకారం కూడా చర్యలు తీసుకోనున్నారు.


