శ్రీకాకుళం: టెక్కలిలో వైఎస్సార్సీపీ కార్యకర్తలే టార్గెట్గా పోలీసులు చర్యలు చర్యలు చేపడుతున్నారు. సీఐ విజయ్ కుమార్ అత్యుత్సాహంపై వైఎస్సార్సీపీ శ్రేణుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వైఎస్సార్సీపీ అభ్యర్థి ఉషారాణి కుమారుడు పృథ్వీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిని బలవంతంగా పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నారంటూ వైఎస్సార్సీపీ శ్రేణుల ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. టెక్కలిలో మాజీ ఎంపీటీసీ శ్రీధర్ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. వరుసగా వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. పలుచోట్ల వైస్సార్సీపీ ఏజెంట్ల ఫామ్లను టీడీపీ గుండాలు చింపివేస్తున్నారు.


