టీడీపీ ఏజెంట్లుగా పోలీసులు.. షాకిచ్చిన ఓటర్లు | Prakasam Police Arrest YSRCP Agents Voters Protest | Sakshi
Sakshi News home page

టీడీపీ ఏజెంట్లుగా పోలీసులు.. షాకిచ్చిన ఓటర్లు

Nov 5 2026 9:04 AM | Updated on Nov 5 2026 9:08 AM

Prakasam Police Arrest YSRCP Agents Voters Protest

సాక్షి, ప్రకాశం: ప్రకాశం జిల్లాలో పోలీసులు తన విధులను మరిచిపోయి అధికార టీడీపీకి వత్తాసు పలికారు. వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను ఎక్కడికక్కడ అక్రమంగా అరెస్ట్‌ చేశారు. దీంతో, పలుచోట్ల గ్రామస్థులు.. వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను విడిచిపెట్టకపోతే ఓటు వేసేది లేదని కూర్చున్నారు. వెంటనే ఏజెంట్లను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు.. పలు ప్రాంతాల్లో టీడీపీ నేతలు రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారు.

ప్రకాశం జిల్లా చీమకుర్లి మండలం గోనుగుంటలో పోలీసులు ఓవరాక్షన్‌కు దిగారు. సీఐ దాసరి ప్రసాద్‌.. వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను అరెస్ట్‌ చేయడం కలకలం రేపింది. దీంతో, గ్రామస్తులు ఎన్నికలకు బహిష్కరించారు. అలాగే, గోనుగుంటలో పోలీసులు దౌర్జన్యానికి దిగారు. వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను అక్రమంగా పోలీసులు నిర్బంధించారు. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు లేకుండా తాము ఓట్లు వేయమని గ్రామస్థులు తెలిపారు. వైఎస్సార్‌సీపీకి చెందిన ఏజెంట్లను వెంటనే విడిచిపెట్టాలని గ్రామస్థులు డిమాండ్‌ చేశారు. కాగా, కొనకనమెట్ల మండలంలో పోలీసుల అదుపులో ఏడుగురు వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు ఉన్నట్టు తెలుస్తోంది. ఇక, దర్శి మండలం రాజంపల్లిలోనూ వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను పోలీసులు స్టేషన​్‌కు తరలించారు.

దర్శి మండలం తానంచింతలలో టీడీపీ రిగ్గింగ్‌కు పాల్పడింది. పోలింగ్‌ బూత్‌లోకి దాదాపు 100 మంది బయటి వ్యక్తులు చొరబడ్డారు. అనంతరం, వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను బయటకు పంపించి యథేచ్చగా రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారు. అలాగే, చలివేంద్ర, వెంకచాచలంపల్లి, చినమనగుండంలో కూడా ఇదే తరహాలో రిగ్గింగ్‌ జరుగుతోంది. మరోవైపు.. నంద్యాల జిల్లాలో టీడీపీ రౌడీలు రిగ్గింగ్‌కు స్కెచ్‌ వేశారు. ఈ క్రమంలో ముచ్చుమర్రిలో వైఎస్సార్‌సీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ్‌ రెడ్డిని పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు.

శ్రీ సత్యసాయి జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత సొంత మండలం రామగిరిలో పచ్చ గూండాలు రెచ్చిపోయారు. వైఎస్సార్‌సీపీ పోలింగ్ ఏజెంట్లను టీడీపీ నేతలు బెదిరించారు. పోలింగ్ కేంద్రంలోకి వస్తే చంపుతామని బెదిరింపులకు గురిచేశారు. ఇంత జరుగుతన్నా పోలీసులు మాత్రం 
ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. 

ఇదీ చదవండి: డీఎస్పీ మురళీ నాయక్‌ ఓవరాక్షన్‌.. అవినాష్‌ రెడ్డి సీరియస్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement