సాక్షి, వైఎస్సార్ జిల్లా: ఏపీలో మున్సిపల్ ఎన్నికల మాదిరిగానే పరిషత్ ఎన్నికల్లోనూ టీడీపీ గూండాలు, పోలీసులు పేట్రేగిపోతున్నారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటెయ్యకుండా మళ్లీ ఉక్కుపాదం మోపుతున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా జరిపించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన పోలీసులే వెన్నుపోటు పార్టీకి అండగా నిలిచి వైఎస్సార్‌సీపీ నేతలను అరెస్ట్ చేస్తూ, పోలింగ్ బూత్‌ల వద్ద ఏజెంట్లను అడ్డుకుంటున్నారు. వైఎస్సార్‌సీపీ నేతలపై దాడులు జరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు.
వైఎస్సార్ జిల్లాలో మరోసారి పచ్చ బ్యాచ్ రెచ్చిపోయింది. పరిషత్ ఎన్నికల సందర్భంగా మళ్లీ అరాచకాలకు పాల్పడింది. పరిషత్ ఎన్నికల సందర్భంగా టీడీపీ నేత బీటెక్ రవి చిన్నాన్న గూండాగిరి దిగారు. పార్లప్లలి బూత్ వద్ద రఘునాథ్ రెడ్డి రెచ్చిపోయారు. వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను బూత్‌ల్లోకి వెళ్లకుండా అడ్డగించారు. ఏజెంట్లపై దాడి చేసి పత్రాలను చించేశారు. ఇదే సమయంలో పార్లపల్లికి వస్తున్న వైఎస్సార్‌సీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. అలాగే, పులివెందులలోని లింగాల మండలం కామసముద్రం పోలింగ్ బూతుల వద్ద బీటెక్ రవి సోదరుడు భరత్ ఓవరాక్షన్‌కు దిగారు. పోలింగ్ సెంటర్లోకి ఓటర్లో వెళ్లకుండా అడ్డుపడుతున్నారు. గ్రామంలో ఇంటింటికీ వెళ్లి ఓటు వేయడానికి రావద్దు అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు
పోలింగ్‌కు ముందే పెద్దముడియం మండలంలో కూటమి నేతల దాడులు మొదలయ్యాయి. భూతపురం గ్రామం వద్ద వైఎస్సార్‌సీపీకి చెందిన నేత కారుపై దాడి చేసి అద్దం పగులగొట్టారు. గుండ్లకుంట గ్రామం వద్ద ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్ ఆధ్వర్యంలో దాడులు కొనసాగుతుండటం గమనార్హం. మొన్న జమ్మలమడుగు మున్సిపాలిటీ ఎన్నికల్లో చేసిన రిగ్గింగ్, ఇప్పుడు పెద్దముడియం మండలంలో అదే తరహాలో చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్న కూటమి నాయకులు. నేడు పెద్దముడియం మండలంలో 9 ఎంపీటీసీ స్థానాలకు ఒక జడ్పీటీసీకి ఎన్నికలు జరుగుతున్నాయి.
పోలింగ్ సందర్బంగా టీడీపీకి పోలీసులు పూర్తిగా సహకరిస్తున్నారు. గ్రామాల్లో వైఎస్సార్‌సీపీ నాయకులే టార్గెట్‌గా అరెస్టులు చేస్తున్నారు. పులివెందుల మండలం ఆర్ తుమ్మలపల్లి సర్పంచ్ మహేశ్వర్ రెడ్డి, సుబ్బారెడ్డిని, నల్లపురెడ్డిపల్లిలో వైఎస్సార్‌సీపీ నాయకుడు ఉమ్మారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు.. వేములలో పోలింగ్ బూత్‌ల వద్ద రాళ్లు సిద్ధం చేసుకున్నారు టీడీపీ నేతలు. పులివెందుల, వేముల, వేంపల్లి, లింగాల మండలంలో అరాచకానికి స్కెచ్ వేశారు. పోలింగ్ బూత్‌ల వద్ద కిరాయి మూకలును ఉంచారు. ఏజెంట్లు, ఓటర్లను అడ్డుకునేందుకు కుట్రకు తెర లేపారు. వేముల మండలంలో పోలింగ్ కేంద్రాల వద్ద టీడీపీ నేతలు రాళ్లను సిద్ధం చేసుకున్నారు. అన్ని మండలాల్లో అదే దాష్టీకానికి టీడీపీ సిద్ధమైంది.
ఇదీ చదవండి:


