21 గ్రామాలు.. రెండు రాష్ట్రాలు.. నలిగిపోతున్న గిరిజనులు!
2,883 మంది ఓటర్ల భవితవ్యం ప్రశ్నార్థకం!
ఏపీ ఎన్నికలకు ఒడిశా అడ్డంకులు..
సరిహద్దుల్లో భారీగా పోలీసు బలగాలు!
గ్రామాలకు వెళ్లే దారుల్లో చెట్లు నరికి దిగ్బంధం!
కొండలు, గుట్టలు దాటి పోలింగ్‌కు రావాల్సిన దుస్థితి!
ఒడిశా అష్టదిగ్బంధనం చేస్తున్నా బాబు సర్కారు ప్రేక్షకపాత్ర!
ప్రకటనలకే పరిమితమైన మంత్రి సంధ్యారాణి..
వైఎస్సార్ సంక్షేమానికి గుర్తుగా నిలిచిన కొటియా..
వైఎస్సార్సీపీకే గిరిజనుల మద్దతు! అందుకే కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం
సాక్షి, అమరావతి/సాక్షి, పాడేరు: ఆంధ్రప్రదేశ్–ఒడిశా సరిహద్దులోని కొటియా గ్రామాల్లో మరోసారి ఆధిపత్య పోరు భగ్గుమంది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న సరిహద్దు వివాదం ఇప్పుడు గిరిజనుల ఓటు హక్కుకు అడ్డంకిగా మారింది. 21 గ్రామాలపై హక్కుల కోసం ఏపీ, ఒడిశా ప్రభుత్వాలు పంతాలకు పోతుంటే.. మధ్యలో దశాబ్దాలుగా గిరిజనులే నలిగిపోతున్నారు. ఈనెల 5న ఏపీ పరిషత్ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్న వేళ.. కొటియా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకోగలరా? అన్న ఆందోళన నెలకొంది. ఏపీలోనే కొనసాగాలన్న స్థానిక గిరిజనుల ఆకాంక్షకు అండగా నిలవాల్సిన కూటమి ప్రభుత్వం ప్రేక్షకపాత్రకే పరిమితమైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి గుమ్మడి సంధ్యారాణి నిర్లక్ష్యంపై కూడా ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
21 గ్రామాలపై ఏడున్నర దశాబ్దాల వివాదం
కొటియా పంచాయతీ పరిధిలో మొత్తం 28 గ్రామాలు ఉండగా.. వాటిలో 21 గ్రామాలపై ఏపీ, ఒడిశా మధ్య హక్కుల వివాదం కొనసాగుతోంది. ఈ గ్రామాలు ఒడిశాలోని కొరాపుట్ జిల్లా పొట్టంగి బ్లాక్ పరిధిలోకి వస్తాయని ఆ రాష్ట్రం వాదిస్తోంది. మరోవైపు ఏపీ ప్రభుత్వం వీటిని పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండల పరిధిలోని గ్రామాలుగా పరిగణిస్తోంది. 1936లో ఒడిశా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పటి నుంచే ఈ వివాదం కొనసాగుతోంది. 1968లో ఒడిశా సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. 2006లో యథాతథ స్థితిని కొనసాగించాలని కోర్టు ఆదేశించింది. 2022 జనవరిలో ఒడిశా మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయినా సమస్యకు శాశ్వత పరిష్కారం లభించలేదు. ఏడు దశాబ్దాలకు పైగా వివాదం కొనసాగుతున్నా.. 21 గ్రామాల భవిష్యత్తుపై స్పష్టత కరువైంది.
ఎన్నికలతో మళ్లీ భగ్గుమన్న వివాదం
కొటియాలోని 21 వివాదాస్పద గ్రామాలకు చెందిన సుమారు 2,883 మంది ఓటర్లు ఏపీ ఓటరు జాబితాలో నమోదయ్యారు. ఫగుణసినేరి, గంజాయిపదర్, ఫటుసినేరి గ్రామాల్లో పరిషత్ ఎన్నికల నిర్వహణకు ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిపై ఒడిశా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తున్నారంటూ అక్టోబర్ 27న ఏపీ అధికారులపై ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్‌పై తుది ఉత్తర్వులు వెలువడకపోవడంతో ఏపీ ఎన్నికల ఏర్పాట్లు కొనసాగిస్తోంది. మరోవైపు ఏపీ ఎన్నికల ప్రక్రియను అడ్డుకునేందుకు ఒడిశా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
అక్టోబర్ 30న కొరాపుట్ జిల్లా యంత్రాంగం అత్యవసర సమావేశం నిర్వహించి కొటియా పరిధిలోని గ్రామాల్లో ఆంక్షలు విధించాలని నిర్ణయించింది. నవంబర్ 1 నుంచి బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 అమల్లోకి తెచి్చంది. ఎన్నికల్లో పాల్గొనేలా ప్రలోభపెట్టడం, ఆంక్షలు ఉల్లంఘించడం వంటి చర్యలకు పాల్పడితే అరెస్టులు తప్పవని హెచ్చరించింది. సరిహద్దు గ్రామాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించి, ప్రతి గ్రామం వద్ద నిఘా ఏర్పాటు చేసింది. ఇళ్ల వద్ద సైతం పోలీసు పహారా కొనసాగుతోంది. రాకపోకలపై ఆంక్షలతో కొండలు, గుట్టలు దాటి ప్రత్యామ్నాయ మార్గాల్లో పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాల్సిన పరిస్థితి గిరిజనులకు ఎదురవుతోంది.
పట్టించుకోని కూటమి
కొటియా గ్రామాల నుంచి ఓటర్లు ఏపీ పోలింగ్ బూత్‌లకు వచ్చి ఓటు వేసే అవకాశం లేకుండా ఒడిశా అష్టదిగ్భందనం చేస్తోంది. గిరిజనులు రాకపోకలు సాగించే రహదారుల్లో చెట్లు నరికి ఒడిశా పోలీసులు అడ్డంగా పడేశారు. ఇంత జరుగుతున్నా సీఎం చంద్రబాబు, సాలూరు ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రిగా ఉన్న గుమ్మడి సంధ్యారాణి మాత్రం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేవలం పత్రికా ప్రకటనలకే పరిమితమైన మంత్రి కొటియా ఓటర్లను పోలింగ్‌కు రప్పించేందుకు ఏమాత్రం ప్రయత్నం చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది.
దివంగత వైఎస్ రాజశేఖరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొటియా పల్లెలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు, పింఛన్లు వంటి సంక్షేమ పథకాలను వారికి అందించారు. అప్పటి నుంచీ అక్కడి గిరిజనులంతా వైఎఎస్ఆర్ను దేవుడిలా భావిస్తుంటారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ పెట్టిన నాటి నుంచి వారంతా వైఎస్సార్సీపీకి జై కొడుతున్నారు. ప్రతి ఎన్నికల్లోనూ ఆ పార్టీ అభ్యర్ధులకే పట్టం కడుతున్నారు. ఈ నేపధ్యంలో వారు పోలింగ్‌కు వచి్చనా తమకు ఓటు వేయరని భావిస్తున్న కూటమి ప్రభుత్వం ఒడిశా అడ్డుకోవడమే మంచిదనే ధోరణిలో చోద్యం చూస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి.
గిరిజనుల ఓటుపై ఒడిశా పహారా.. కూటమి మౌనం!
కొటియా గ్రామాల నుంచి ఏపీ పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు చేరుకోకుండా ఒడిశా ప్రభుత్వం అష్టదిగ్బంధనం చేస్తోంది. గిరిజనులు రాకపోకలు సాగించే మార్గాల్లో చెట్లు నరికి అడ్డంకులు సృష్టించారు. వందలాది మంది పోలీసులతో సరిహద్దులను దిగ్బంధించినా.. ఏపీ ప్రభుత్వం మాత్రం ఓటర్లకు భరోసా కల్పించడంలో విఫలమైందన్న ఆగ్రహం వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, స్థానిక ఎమ్మెల్యే, మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఈ వ్యవహారంలో క్రియాశీలంగా వ్యవహరించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రకటనలకే పరిమితమైన మంత్రి.. గిరిజన ఓటర్లు నిర్భయంగా పోలింగ్‌లో పాల్గొనేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
వైఎస్సార్ సంక్షేమానికి గుర్తుగా కొటియా గిరిజనులు
దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కొటియా గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించి రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు, పింఛన్లు వంటి సంక్షేమ పథకాలను గిరిజనులకు అందించారు. దీంతో అక్కడి ప్రజల్లో వైఎస్సార్‌పై ప్రత్యేక అభిమానం ఏర్పడింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ స్థాపించిన తర్వాత కొటియా గిరిజనులు వైఎస్సార్సీపీకి మద్దతుగా నిలుస్తున్నారు. ప్రతి ఎన్నికల్లోనూ ఆ పార్టీ అభ్యర్థులకే మద్దతు తెలుపుతున్న నేపథ్యంలో.. ఈసారి కూడా వారు వైఎస్సార్సీపీకే ఓటు వేస్తారన్న భయంతోనే కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.


