పరిషత్‌ ఎన్నికలు.. ఎక్కడికక్కడ వైఎస్సార్‌సీపీ నేతలు అరెస్ట్‌ | AP ZPTC, MPTC Elections 2026 Live News Updates, Polling Begins Amid Tensions Across Andhra Pradesh | Sakshi
Sakshi News home page

AP MPTC, ZPTC Elections News: పరిషత్‌ ఎన్నికలు.. ఎక్కడికక్కడ వైఎస్సార్‌సీపీ నేతలు అరెస్ట్‌

Nov 5 2026 6:47 AM | Updated on Nov 5 2026 7:15 AM

AP MPTC And ZPTC Elections Polling Live Updates

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్‌ అప్‌డేట్స్

వైఎస్సార్ జిల్లా

  • జడ్పీటీసీ ఎన్నికల్లో మళ్లీ అరాచకాలకు పాల్పడుతున్న టీడీపీ
  • టీడీపీకి పూర్తిగా సహకరిస్తున్న పోలీసులు
  • గ్రామాల్లో వైఎస్సార్‌సీపీ నాయకులే టార్గెట్‌గా అరెస్టులు
  • పులివెందుల మండలం ఆర్ తుమ్మలపల్లి సర్పంచ్ మహేశ్వర్ రెడ్డి, సుబ్బారెడ్డిల అరెస్ట్
  • నల్లపురెడ్డిపల్లిలో వైఎస్సార్‌సీపీ నాయకుడు ఉమ్మారెడ్డి అరెస్ట్
  • వేములలో పోలింగ్ బూత్‌ల వద్ద రాళ్లు సిద్ధం చేసుకున్న టీడీపీ నేతలు
  • పులివెందుల, వేముల, వేంపల్లి, లింగాల మండలంలో అరాచకానికి స్కెచ్
  • పోలింగ్ బూత్‌ల వద్ద కిరాయి మూకలు
  • ఏజెంట్లు, ఓటర్లను అడ్డుకునేందుకు కుట్ర

 

టీడీపీ నేతల అరాచకం..

  • అన్నమయ్య జిల్లాలో రెచ్చిపోయిన టీడీపీ నేతలు
  • పుంగనూరు మండలం ఈడిగపల్లిలో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు ఐడీలను లాక్కొని వారిని బయటకు నెట్టివేసిన కూటమి నేతలు
  • చౌడేపల్లి మండలం దుర్గ సముద్రంలో ఏజెంట్ల ఐడీలను లాక్కొని ఇదే తరహాలో బయటకు పంపించిన కూటమి నేతలు

వైఎస్సార్ జిల్లా..

  • పెద్దముడియం మండలంలో మొదలైన కూటమి  నేతల దాడులు
  • భూతపురం గ్రామం వద్ద వైఎస్సార్‌సీపీ నేత కారుపై దాడి చేసి అద్దం పగులగొట్టిన పచ్చ గూండాలు
  • గుండ్లకుంట గ్రామం వద్ద ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు
  • నేడు పెద్దముడియం మండలంలో 9 ఎంపీటీసీలకు ఒక జడ్పీటీసీకి జరగనున్న ఎన్నికలు
  • పోలింగ్ మొదలవకముందే దాడులకు పాల్పడుతున్న కూటమి గుండాలు
  • బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న దాడులు
  • మొన్న జమ్మలమడుగు మున్సిపాలిటీ ఎన్నికల్లో చేసిన రిగ్గింగ్, 
  • ఇప్పుడు పెద్దముడియం మండలంలో అదే తరహాలో చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్న కూటమి నాయకులు
  • పెద్దఎత్తున బయటి ప్రాంతాల నుండి రౌడీ మూకలను తరలించి హింసా కాండకు రంగం సిద్ధం


నంద్యాల జిల్లా...

  • జూపాడుబంగ్లా (మ) మండ్లెం పోలింగ్ బూత్ వద్ద ఉద్రిక్తత,
  • వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను లోపలికి పోనివ్వకుండా అడ్డుకున్న పోలీసులు,
  • ఇదేమీ న్యాయం అంటూ పోలీసుల తీరుపై తిరగబడ్డ జనం..
  • పోలింగ్ బూత్ వద్ద  బైఠాయించి నిరసన తెలిపిన ఏజెంట్లు,
  • బలవంతంగా బయటకు పంపేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులు

వైఎస్సార్ జిల్లా..

  • జడ్పీటీసీ ఎన్నికల్లోనూ అరాచకానికి తెరలేపుతున్న టీడీపీ
  • వేముల మండలంలో పోలింగ్ కేంద్రాల వద్ద రాళ్లు సిద్ధం చేసిన టీడీపీ నాయకులు
  • ఉదయాన్నే పోలింగ్ బూత్‌లను ఆక్రమించుకునేందుకు కిరాయి మూకలను సిద్ధం చేస్తున్న పచ్చ బ్యాచ్‌
  • రాళ్లు, కర్రలు సిద్ధం చేసుకుని ఏజెంట్లు, ఓట్లర్లపై దాడికి సిద్ధం
  • పులివెందుల నియోజకవర్గంలో లింగాల, పులివెందుల, వేముల, వేంపల్లిలో జడ్పీటీసీ ఎన్నికలు
  • అన్ని మండలాల్లో అదే దాష్టీకానికి సిద్ధమవుతున్న టీడీపీ

 

  • కాసేపట్లో పరిషత్‌ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం.. 

  • 582 జడ్పీటీసీ,7,767 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్‌ 

  • పోటీలో మొత్తం 20,966 మంది అభ్యర్థులు 

  • 2.61 కోట్ల మంది ఓటర్లు.. 31,460 పోలింగ్‌ కేంద్రాలు  

  • పోలింగ్‌కు వర్షం బెడద

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement