ఇటీవల చెన్నేకొత్తపల్లిలో టీడీపీ శ్రేణులను రెచ్చగొడుతున్న టీడీపీ ఎమ్మెల్యేలు ,రాప్తాడులో మహిళ నుంచి నామినేషన్ పత్రాలు లాక్కుంటున్న టీడీపీ గూండాలు
శ్రీసత్యసాయి జిల్లా: రాప్తాడు నియోజకవర్గంలో జరుగుతున్న వరుస సంఘటనలు పచ్చ గూండాల వికృత చేష్టలకు ఉదాహరణగా నిలుస్తున్నాయి. తమకెవరూ పోటీ ఉండకూడదు.. తమకెవరూ పోటీరాకూడదు.. తమకెవరూ పోటీ కాదు అనే దృఢ నిశ్చయంతో పరిటాల అండ చూసుకొని పచ్చ నేతలు రెచ్చిపోతున్నారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక నియంతృత్వ పాలనలో ఉన్నామా అనే భావనను కలిగించే విధంగా ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.
రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరిన మరుక్షణం నుంచి రాప్తాడు రక్తమోడుతూనే ఉంది. నియోజకవర్గ వ్యాప్తంగా ఏదో ఒక ప్రాంతంలో వైఎస్సార్‌సీపీ వర్గీయులపై భౌతిక దాడులు, ఇళ్లు, వాహనాలపై రాళ్ల దాడులు, పొలాలను లాక్కోవడం వంటి పరిణామాలను చూస్తుంటే ఇక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడిజిల్లాలో ఎక్కడాలేని విధంగా ఒక్క రాప్తాడులో వరుస సంఘటనలు జరుగుతున్నా కేసులు మాత్రం నామమాత్రంగా ఉండడంతో పోలీస్ అధికారులు ఏం చేస్తున్నారనే విమర్శలున్నాయి. ఈ క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా జరుగుతాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఓటింగ్ సక్రమంగా జరిగేనా?
పరిషత్ ఎన్నికల్లో భాగంగా గురువారం జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీల ఓటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాస్వామ్యంలో ఎవరి పారీ్టకి వారు మద్దతు పలుకుతూ, ఓటు వేసుకోవచ్చని అయితే గురువారం జరిగే ఈ ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని ప్రజలు దేవున్ని ప్రారి్థస్తున్నారు.
నామినేషన్లలో అరాచకం..
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల వేళ నామినేషన్లు వేయడానికి వస్తున్న వైఎస్సార్‌సీపీ వర్గీయులను రెండు రోజులు నామినేషన్లు వేయనీకుండా రాప్తాడు, రామగిరి, కనగానపల్లి, ఆత్మకూరు, చెన్నేకొత్తపల్లి, అనంతపురం రూరల్ మండలాల్లో పచ్చనేతలు అడ్డుకొన్న సంగతి తెలిసిందే. నామినేషన్ వేయడానికి వస్తున్న అభ్యర్థులపై రాళ్ల దాడులు చేయడం, అలాగే మహిళలు అని కూడా చూడకుండా నామినేషన్ పత్రాలను వారి వద్ద నుంచి బలవంతంగా లాక్కోవడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. నియోజకవర్గ వ్యాప్తంగా ఒక్క నామినేషన్ పడకూడదనే పరిటాల ఆదేశాలతో అన్ని స్థానాలను ఏకగ్రీవం చేయాలని పచ్చనేతలు కుట్రలు పన్నారు. చివరకు ఎన్నికల కమిషన్ దృష్టికి వైఎస్సార్‌సీపీ నేతలు తీసుకెళ్లడంతో మూడోరోజున పోలీసుల భద్రతతో వైఎస్సార్‌సీపీ నేతలు అడపాదడపా నామినేషన్ పత్రాలను దాఖలు చేయాల్సి వచ్చింది.
గతంలో రామగిరిలో పది ఎంపీటీసీ స్థానాలకు గాను తొమ్మిది స్థానాలను వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. కానీ రాష్ట్రంలో
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎంపీటీసీలను కిడ్నాప్ చేసి చివరకు వారిని ప్రలోభాలు, భయభ్రాంతులకు గురిచేస్తూ ఒక్క ఎంపీటీసీతోనే ఎంపీపీ పీఠాన్ని టీడీపీ కైవసం చేసుకుంది.ప్రస్తుతం గ్రామాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ చివరకు సొంత గ్రామాలను సైతం వదలి ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్తున్నారు. రక్తపాతం వదలి నియోజకవర్గంలోని అన్ని చెరువులకు సాగు నీరందిస్తే తాము పంటలను సాగుచేసుకుంటూ కుటుంబపోషణ చేసుకుంటామని ప్రజలు కోరుతున్నారు. కానీ పరిటాల అరాచకాలతో ఆ పరిస్థితులు మచ్చుకైనా కనిపించడం లేదు.


