సాక్షి, చెన్న: శాసనసభ ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ సోషల్ మీడియా వేదికగా రాష్ట్ర ప్రభుత్వంపై, సీఎం విజయ్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రేషన్ షాపుల ద్వారా ప్రజలకు పంపిణీ చేసేందుకు కొనుగోలు చేసిన ఉల్లిపాయల వ్యవహారంలో ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం తెలిసిన డమ్మీ సీఎంకి ఉల్లిపాయలు కొనడం తెలీదా? అని ప్రశ్నించారు. సహకార శాఖ ద్వారా ఈ ప్రభుత్వం ఉల్లిపాయలను కొనుగోలు చేసిన తీరే వీరి అసమర్థతకు అద్దం పడుతోందని మండి పడ్డారు. ఎటువంటి ముందస్తు నాణ్యతా పరిశీలన లేకుండా నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ నుండి 450 టన్నుల ఉల్లిపాయలను కొనుగోలు చేశారని మండిపడ్డారు.
రైల్వే టెర్మినల్‌లోనే వదిలేశారు..
మహారాష్ట్ర నుండి రైలులో వచ్చిన ఆ ఉల్లిపాయలు పూర్తిగా కుళ్ళిపోయి, నిరుపయోగంగా ఉండటంతో ఆ విషయాన్ని కప్పిపుచ్చేందుకు కొరుక్కుపేటై రైల్వే టెర్మినల్‌లోనే అధికారులు వదిలేశారని ఆయన ఆరోపించారు. దుర్గంధం వస్తుండటంతో, ఆ ఉల్లిపాయలతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని అబద్ధాలు ప్రచారం చేయడం విచారకరంగా పేర్కొన్నారు. కుళ్ళిపోయిన ఆ ఉల్లిపాయలలో కొంత భాగాన్ని తిరుచ్చి గాంధీ మార్కెట్‌లో విక్రయించడానికి లారీల్లో పంపారని, అయితే వ్యాపారులు ఆ ఉల్లిపాయలను చూడకుండా కొనలేమని నిరాకరించడంతో లారీ డ్రైవర్లు ఏమి చేయాలో తోచక ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.
ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేశారు..
ఒకవైపు ఉల్లి ధరలు పెరిగి ప్రజలు కన్నీళ్లు పెడు తుంటే, ఎలాంటి పట్టింపు లేకుండా ఉప ఎన్నికల పనుల్లో బిజీగా మారిపోయారని ఎద్దేవా చేశారు. గతంలో రేషన్ షాపుల్లో రూ30 కే పొన్ని బియ్యం ఇస్తామని చెప్పి, టెండర్లు లేకుండా సాధారణ బియ్యాన్నే పాలిష్ చేసి అమ్ముతున్న వ్యవహారంపై తాను ప్రశి్నస్తే సమాధానం చెప్పకుండా దాటవేశారని గుర్తుచేశారు. ఈ నాసిరకం ఉల్లిపాయల కొనుగోలుకు బాధ్యులెవరో, దీనిని కప్పిపుచ్చేందుకు ప్రయతి్నంచిన వారెవరో సీఎం సమాధానం చెప్పాలని ఉదయనిధి స్టాలిన్ డిమాండ్ చేశారు.


