ఓటీటీలో ‘నూరుకోడి వానవిల్‌’ | - | Sakshi
Sakshi News home page

ఓటీటీలో ‘నూరుకోడి వానవిల్‌’

Nov 5 2026 1:40 AM | Updated on Nov 5 2026 1:40 AM

నూరుకోడి వానవిల్‌ చిత్రంలో హరీష్‌ కల్యాణ్‌,

సిద్ధి ఇద్నాని

తమిళసినిమా: ఇటీవల మంచి పేరు తెచ్చుకుంటున్న యువ కథా నాయకులలో హరీష్‌ కళ్యాణ్‌ ఒకరు. ఈ మధ్య కథానాయకుడిగా నటించిన లబ్బర్‌ బంతు చిత్రం మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. కాగా హరీష్‌ కళ్యాణ్‌ కథానాయకుడుగా ఇంతకు ముందే నటించిన నూరు కోడి వానవిల్‌ చిత్రం త్వరలో విడుదల కానుంది. వైవిధ్యభరిత కథ చిత్రాల దర్శకుడు శశి కథ దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన ఈ చిత్రంలో నటి సిద్ది ఇద్నాని నాయకగా నటించారు. కోవై సరళ, తంబి రామయ్య, చిన్ని జయంత్‌, సంపత్‌, ఎం రైనీల్‌, డీజే పార్వతి తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి సిద్ధూ కుమార్‌ సంగీతాన్ని అందించారు. మాధవ్‌ మీడియా పతాకంపై బాలాజీ కపా, అరుణ్‌ అరుణాచలం కలిసి నిర్మించిన ఈ చిత్రం దీపావళి సందర్భంగా శుక్రవారం నుంచి నేరుగా జీ 5 ఓటీటీ స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్న చిత్ర కథానాయకుడు హరీష్‌ కళ్యాణ్‌ మాట్లాడుతూ ‘‘ పాటలు ,ఇతర సన్నివేశాలు అంటూ ప్రతి విషయంలోనూ ప్రతి ఒక్కరూ ఎంతో శ్రమ పెట్టిన చిత్రం నూరు కోడి వానవిల్‌. చాలా కాలం క్రితమే నిర్మాణ కార్యక్రమం పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇప్పటివరకు విడుదల కాకపోవడం కాస్త బాధాకరమే. దర్శకుడు శశి ఎంతో ఆలోచనపరుడు మంచి టెక్నిషియన్‌. అంతే కాకుండా చాలా క్రమశిక్షణ కలిగిన వ్యక్తి. అందరూ సరైన సమయానికి షూటింగ్‌కు రావాలి. సమయాన్ని వృథా చేయకూడదు. డబ్బులు కూడా అనవసరంగా ఖర్చు చేయకూడదు అని భావించే వ్యక్తి. షూటింగ్‌ కూడా ప్రణాళిక ప్రకారం నిర్వహించారు. ఆయన నుంచి క్రమశిక్షణ అనేది మేమంతా నేర్చుకున్నాం. ఈ చిత్రం అందరికీ నచ్చే విధమైన ప్రేమ కథ చిత్రం గా ఉంటుంది. మంచి ఎమోషనల్‌ సన్నివేశాలు చోటు చేసుకుంటాయి ‘‘ అని పేర్కొన్నారు. ఇది మంచి రామ్‌ కామ్‌ కథా చిత్రం అని దర్శకుడు శశి పేర్కొన్నారు.

నటుడు

షెన్‌ నిగంతో పాటు

యూనిట్‌ సభ్యులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement