సాక్షి, చైన్నె : ద్విచక్ర వాహన సంస్థ న్యూమరోస్ మోటార్స్ మహిళా అథ్లెట్ల అసాధారణ విజయాలు, వారి శ్రమ , నిబద్ధతను చాటిచెప్పే లక్ష్యంతో వైబ్ మూవర్స్ పేరిట ప్రత్యేక ప్రచార సిరీస్‌ను ప్రారంభించింది. ఈ సిరీస్ మొదటి దశలో ఒలింపిక్ ఫెన్సర్ భవానీ దేవి, జాతీయ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్ యశస్విని ఘోర్పడే , జాతీయ ఫుట్‌బాల్ క్రీడాకారిణి మిథిలా రమణిల స్ఫూర్తిదాయక కథనాలను ప్రదర్శిస్తున్నారు. ఈ చొరవలో భాగంగా, న్యూమరోస్ మోటార్స్ ఈ ముగ్గురు క్రీడాకారిణుల ప్రతిభకు , పట్టుదలకు గుర్తింపుగా ఒక్కొక్కరికి ఒక క్రాస్‌ఓవర్ యుటిలిటీ వెహికల్‌ను బహుమతిగా అందజేసింది. ఈసందర్బంగా ఆసంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అరుణ్ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. తమ క్రాస్‌ఓవర్ యుటిలిటీ వాహనాలు ఏ విధంగానైతే దృఢత్వానికి, విశ్వసనీయతకు చిహ్నంగా నిలుస్తాయో, ఈ ఛాంపియన్ అథ్లెట్లు కూడా అదే విధమైన పట్టుదల , శ్రమతో సవాళ్లను అధిగమించి విజేతలుగా నిలిచారు. వారి ప్రస్థానం అందరికీ ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. అడ్డంకులను దాటుకుని స్వయంకృషితో ఎదిగిన మహిళా అథ్లెట్లకు తగిన గుర్తింపు నిచ్చేలా ఈ సిరీస్‌ను రూపొందించామన్నారు.


