టీవీకే ప్రభుత్వంపై స్టాలిన్‌ విమర్శలు | - | Sakshi
Sakshi News home page

టీవీకే ప్రభుత్వంపై స్టాలిన్‌ విమర్శలు

Nov 5 2026 1:40 AM | Updated on Nov 5 2026 1:40 AM

● కోవైలో డీఎంకే కార్యాలయానికి శంకుస్థాపన

సాక్షి, చైన్నె : కోయంబత్తూరులోని గాంధీపురంలో కొత్తగా ఏర్పాటైన పెరియార్‌ సైన్స్‌ అండ్‌ నాలెడ్జ్‌ సెంటర్‌ (పెరియార్‌ విజ్ఞాన కేంద్రం) పనులు 99 శాతం పూర్తికాబట్టే ఇవాళ అందుబాటులోకి వచ్చిందని, లేకపోతే ప్రస్తుత ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌ను మూసివేసి ఉండేదని డీఎంకే అధ్యక్షుడు ఎం.కే. స్టాలిన్‌ విమర్శించారు. ద్రవిడర్‌ కళగం నాయకుడు కె. వీరమణితో కలిసి ఆయన బుధవారం ఈ విజ్ఞాన కేంద్రాన్ని సందర్శించారు.

యువతకు పిలుపు

నేటి సమాజంలో ద్రావిడ ఉద్యమం అంటే ఏమిటి? ద్రావిడ సిద్ధాంతాల ప్రాముఖ్యత ఏమిటి? అని తెలుసుకోవడానికి యువత, విద్యార్థులు పెరియార్‌ మేధో ప్రపంచాన్ని సందర్శించాలని పిలుపు నిచ్చారు. పెరియార్‌ భావాలను, ఆదర్శాలను అర్థం చేసుకుని తమ జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని కోరారు.గతంలో కొట్టూరుపురంలో అన్నా శత వార్షికోత్సవ గ్రంథాలయం, మదురైలో కళైజ్ఞర్‌ శత వార్షికోత్సవ గ్రంథాలయం నిర్మించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. నైల్లెలో కాయిదే మిల్లత్‌ పేరుతో, తిరుచ్చిలో కామరాజ్‌ పేరుతో గ్రంథాలయ పనులు జరుగుతున్నాయని తెలిపారు. కోయంబత్తూరు పెరియార్‌ లైబ్రరీ 99.75% పనులు ఇప్పటికే పూర్తవడం వల్ల అదృష్టవశాత్తు ఇది రక్షించబడిందని, లేకపోతే ఈ ప్రభుత్వం దీనిని కూడా నిలిపివేసేదని మండిపడ్డారు.ఈ సందర్భంగా ద్రవిడర్‌ కళగం నాయకుడు కె. వీరమణి మాట్లాడుతూ..తన 84 ఏళ్ల ప్రజా జీవితంలో ఇదొక సువర్ణావకాశంఅ ని, కోయంబత్తూరులోని గాంధీపురంలో రూపుదిద్దుకున్న ఈ లైబ్రరీ వేల సంవత్సరాల పాటు నిలిచిపోతుందన్నారు. ఇది కేవలం గ్రంథాలయం మాత్రమే కాదు, ఓ విజ్ఞాన కేంద్రం అని కొనియాడారు. కుల, మత భేదాలు లేకుండా ప్రతీ ఒక్కరూ సందర్శించదగిన ఈ ప్రాజెక్ట్‌ను సాకారం చేసినందుకు ఎం.కే. స్టాలిన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కోయంబత్తూరులో డీఎంకే కార్యాలయం పనులకు స్టాలిన్‌శంకుస్థాపన చేశారు.సాయంత్రం ఈ గ్రంథాలయాన్ని నిర్మించిన స్టాలిన్‌కు అభినందనలు తెలుపుతూ సత్కార కార్యక్రమం జరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement