శశికళకు మరో బిగ్‌ షాక్‌.. | Sasikala Removed As Aiptmmk General Secretary | Sakshi
Sakshi News home page

శశికళకు మరో బిగ్‌ షాక్‌..

Oct 30 2026 7:11 AM | Updated on Oct 30 2026 7:45 AM

Sasikala Removed As Aiptmmk General Secretary

తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. దివంగ‌త మాజీ సీఎం జ‌య‌ల‌లిత స‌న్నిహితురాలు, ఒకప్పుడు అన్నాడీఎంకేలో కీలక పాత్ర పోషించిన వీకే శశికళకు మరోసారి రాజకీయంగా ఎదురుదెబ్బ తగిలింది. ఆల్‌ ఇండియా పురట్చి తలైవర్‌ మక్కల్‌ మున్నేట్ర కళగం (AIPTMMK) నుంచి ప్రధాన కార్యదర్శి శశికళను తొలగిస్తున్నట్లు ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు చక్రవర్తి సంచలన ప్రకటన చేశారు.

ఎన్నికల అనంతరం పార్టీ కార్యకలాపాలకు శశికళ దూరంగా ఉంటున్నారనే కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. చెన్నైలోని వలసరవాక్కంలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన చక్రవర్తి.. ఎన్నికల తర్వాత శశికళ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని.. ఆమెను కలిసేందుకు కూడా తనకు అవకాశం లభించలేదని తెలిపారు.

ఈ నిర్ణయాన్ని ఇప్పటికే ఎన్నికల సంఘానికి తెలియజేసినట్లు చెప్పారు. త్వరలోనే నూతన ప్రధాన కార్యదర్శిని నియమిస్తామని చెప్పారు. తమిళనాడులోని ప్రస్తుత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీ రెండు తీర్మానాలు కూడా ఆమోదించినట్లు చక్రవర్తి తెలిపారు. అన్నాడీఎంకే (AIADMK) నుంచి బహిష్కరణకు గురైన అనంతరం ఈ ఏడాది ప్రారంభంలో శశికళ కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. ఆల్ ఇండియా పురట్చి తలైవర్ మక్కల్ మున్నేట్ర కళగం పేరుతో పార్టీని ఏర్పాటు చేశారు.

కొబ్బరి తోటను పార్టీ ఎన్నికల గుర్తుగా నిర్ణయించారు. అంతేకాకుండా నలుపు, తెలుపు, ఎరుపు రంగులతో పార్టీ జెండాను కూడా పరిచయం చేశారు. అందులో అన్నాదురై, ఎంజీఆర్, జయలలిత చిత్రాలను పొందుపరిచారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దోషిగా తేలడంతో శశికళను అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే.

ఇదీ చదవండి: రక్తవర్ణంలోకి మారిన ఆకాశం.. అర్నబ్‌ తుపాన్‌ ప్రభావమేనా?

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement