కీలక ప్రశ్నలకు సమాధానాల్లేవ్‌  | Activists question SIR decision, allege lack of records | Sakshi
Sakshi News home page

కీలక ప్రశ్నలకు సమాధానాల్లేవ్‌ 

Oct 30 2026 4:22 AM | Updated on Oct 30 2026 4:22 AM

Activists question SIR decision, allege lack of records

ఎస్‌ఐఆర్‌పై నిర్ణయాలు ఏకగ్రీవమైతే రికార్డులేవి?  

అఫిడవిట్‌లో అభ్యంతరాల తీవ్రతను తగ్గించడానికి ప్రయతి్నంచారు  

ఎస్‌ఐఆర్‌కు సంబంధించిన రికార్డులను బహిర్గతం చేయాలి 

సామాజిక కార్యకర్తలు ప్రశాంత్‌ భూషణ్, అంజలి భరద్వాజ్, యోగేంద్ర, నేహా బోరా డిమాండ్‌  

న్యూఢిల్లీ:  ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) విషయంలో సుప్రీంకోర్టులో ఎన్నికల సంఘం సమరి్పంచిన తాజా అఫిడవిట్‌లో అనేక కీలక ప్రశ్నలకు సమాధానాలు లేవని సామాజిక కార్యకర్తలు ప్రశాంత్‌ భూషణ్, అంజలి భరద్వాజ్, యోగేంద్ర యాదవ్, నేహా బోరా ఆరోపించారు. ఎస్‌ఐఆర్‌పై ఎన్నికల సంఘం నిర్ణయాధికార విధానాన్ని ప్రశ్నించారు. వారు గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సంఘం అక్టోబర్‌ 26న దాఖలు చేసిన కౌంటర్‌ అఫిడవిట్‌పై ప్రశ్నలు లేవనెత్తారు. 

ఎస్‌ఐఆర్‌ నిర్ణయాలు ఏకగ్రీవంగా తీసుకున్నామన్న వాదనలకు, 2025లో దేశవ్యాప్తంగా ఈ ప్రక్రియను ప్రారంభించేందుకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచార హక్కు చట్టం కింద గతంలో ఇచ్చిన ప్రతిస్పందనకు మధ్య వ్యత్యాసం ఉందని ఆరోపించారు. ఎస్‌ఐఆర్‌పై నిర్ణయానికి సంబంధించిన రికార్డులను తాను కోరానని, అయితే అటువంటి ఫైల్‌ ఏదీ అందుబాటులో లేదని ఎన్నికల సంఘానికి చెందిన ప్రజా సమాచార అధికారి తెలియజేశారని అంజలి భరద్వాజ్‌ చెప్పారు. 

దీనిపై అప్పీల్‌ అధికారిని సంప్రదించగా.. ఎన్నికల కమిషన్‌ ప్రధాన కార్యదర్శి రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారని, 2025లో దేశవ్యాప్తంగా ఎస్‌ఐఆర్‌ను ప్రారంభించాలని ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారని పేర్కొన్నారు. ఈ నిర్ణయాన్ని ఎన్నికల సంఘం తీసుకోకపోతే మరి ఎవరు తీసుకున్నారు? అని అంజలి భరద్వాజ్‌ నిలదీశారు. ఈ నిర్ణయం ఎప్పుడు, ఎలా తీసుకున్నారో తెలిపే పత్రాలు లేకపోవడాన్ని ప్రస్తావించారు. 2025 జూన్‌ 24, 2025 అక్టోబర్‌ 27 మరియు 2026 మే 14 తేదీల్లో జారీ చేసిన మూడు ఉత్తర్వులను ఏకగ్రీవంగా ఆమోదించినట్లుగా సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్నారని తెలిపారు. అయితే, అలాంటి ఏకగ్రీవ ఆమోదానికి సంబంధించిన రికార్డులు ఎందుకు లేవని మండిపడ్డారు.  

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియకు సంబంధించి ఇద్ద రు ఎన్నికల కమిషనర్లు లేవనెత్తిన అభ్యంతరాలను కేవలం సూచనలుగా లేదా అభిప్రాయ భేదాలుగా పరిగణించి వాటి తీవ్రతను తగ్గించడానికి ఎన్నికల సంఘం ప్రయతి్నంచిందని ప్రశాంత్‌ భూషణ్‌ ఆరోపించారు. అత్యవసర పరిస్థితుల్లో నిర్ణయాలను ఎల్రక్టానిక్‌గా ఆమోదించి, అనంతరం అధికారిక ఫైళ్లలో నమోదు చేయవచ్చని ఎన్నికల కమిషన్‌ ఇచ్చిన వివరణను కూడా ఆయన ప్రశ్నించారు. ఓటర్ల జాబితా డేటాబేస్‌ను కేంద్రీకరించడం, ఓటర్ల పేర్లను చేర్చే లేదా తొలగించే అధికారాన్ని కేంద్రీకరించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై గతంలో వ్యక్తపరిచిన ఆందోళనలను ఎందుకు పరిష్కరించలేదని ప్రశ్నించారు. డేటాబేస్‌లో మార్పు లు చేయడానికి ఎవరికి అధికారం ఉందో చెప్పాలన్నారు. ఎన్నికల నమోదు అధికారులను పక్కనపెట్టి.. ఎన్నికల కమిషన్‌ ఢిల్లీ కార్యాలయంలోని ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ యూనిట్ల ద్వారా పేర్లను చేర్చడం, తొలగించడం వంటి ప్రక్రియను కేంద్రీకరించారని విమర్శించారు. ఫారం–6లో చేసిన మార్పులను కూడా తప్పుపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement