ట్రావెన్ కోర్ దేవస్వమ్ బోర్డు కీలక ప్రకటన | Travancore Devaswom Board makes a key announcement | Sakshi
Sakshi News home page

ట్రావెన్ కోర్ దేవస్వమ్ బోర్డు కీలక ప్రకటన

Oct 30 2026 1:00 AM | Updated on Oct 30 2026 1:00 AM

 Travancore Devaswom Board makes a key announcement

తిరువనంతపురం: ట్రావెన్ కోర్ దేవస్వమ్ బోర్డు కీలక ప్రకటన చేసింది. మండల కాలం సమీపిస్తున్న తరుణంలో,అరవణ ఉత్పత్తిలో సమస్య పరిష్కారం కోసం అక్టోబర్ 30న నూతన ఈ-టెండర్‌ను ఆహ్వానిస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది. పంబ నుండి సన్నిధానానికి అరవణ తయారీకి కావలసిన ముడిసరుకులను రవాణా చేసే ట్రాక్టర్ రవాణా కాంట్రాక్టులో ఏర్పడిన వివాదం కారణంగా అరవణ ఉత్పత్తిలో సమస్యలు తలెత్తాయి. దీంతో దేవస్వమ్‌ బోర్డ్‌ ఈ- టెండర్‌ను ఆహ్వానించింది.

సరుకుల సరఫరా నిరంతరం కొనసాగుతోందని , రవాణా సమస్యను త్వరలోనే పరిష్కరించడానికి తగిన చర్యలు తీసుకుంటున్నామని దేవస్వమ్ బోర్డు తెలిపింది. మండల కాలం కోసం ఏర్పాట్లు ఎలాంటి అడ్డంకులు లేకుండా జరగాలని , అయ్యప్ప భక్తులందరికీ స్వామి అయ్యప్ప దివ్య ఆశీస్సులు లభించాలని ట్రావెన్‌ కోర్‌ దేవస్వమ్ బోర్డు ఆశాభావం వ్యక్తం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement