బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. తుపానుగా మారే అవకాశం ఉందా? | Is there a possibility of Another low-pressure turning into a cyclone | Sakshi
Sakshi News home page

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. తుపానుగా మారే అవకాశం ఉందా?

Oct 29 2026 8:16 PM | Updated on Oct 29 2026 8:57 PM

Is there a possibility of Another low-pressure turning into a cyclone

సాక్షి, న్యూఢిల్లీ: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. అండమాన్‌ సముద్రం సమీపంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం గురువారం ఉదయం అల్పపీడనంగా బలపడినట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అధికారులు వెల్లడించారు. రానున్న 72 గంటల్లో ఇది మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపారు. 

అయితే ఈ అల్పపీడనం తుపానుగా మారుతుందా.. లేదా? అన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే  వాతావరణ శాఖ ప్రస్తుతానికి ఎలాంటి తుపాను హెచ్చరికలు జారీ చేయలేదు. ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ అండమాన్‌ సముద్రం పరిసర ప్రాంతాల్లో మరింత బలపడే అవకాశం ఉందని ఐఎండీ శాస్త్రవేత్తలు తెలిపారు.

మరోవైపు ఇప్పటికే తీవ్ర తుపాను ‘అర్నబ్‌’ బలహీనపడుతోంది. గురువారం ఉదయం 8.30 గంటల సమయానికి దక్షిణ ఛత్తీస్‌గఢ్‌, దానికి ఆనుకుని ఉన్న దక్షిణ ఒడిశా ప్రాంతాల్లో ఇది వాయుగుండంగా కొనసాగింది. గత ఆరు గంటల్లో గంటకు 18 కిలోమీటర్ల వేగంతో కదిలింది. గురువారం రాత్రికి మరింత బలహీనపడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.

ఒకవేళ ఇది తుపానుగా మారితే ఆంధ్రప్రదేశ్‌ తీరానికి మరో ముప్పు పొంచి ఉన్నట్టే. ఇప్పటికే అర్నబ్‌ తుపాన్‌ ప్రభావంతో ఇవాళ కూడా(గురువారం) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే తడిసి ముద్దయిన ఉత్తరాంధ్రపై మరోసారి కుండపోత కురిస్తే వాగులు, వంకలు ఉప్పొంగే ప్రమాదం ఉంది. విశాఖ, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాలతో పాటు యానాంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. ఎన్టీఆర్, పల్నాడు, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయి.

గురువారం కూడా ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. కాకినాడ, మచిలీపట్నం పోర్టుల్లో 10వ నంబర్, విశాఖ, గంగవరం, భీమునిపట్నం పోర్టుల్లో 9వ నంబర్‌ ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి.

సాధారణంగా అక్టోబర్‌, నవంబర్‌ నెలల్లో బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనాలు, వాయుగుండాలు తుపానులుగా బలపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దాంతో కొత్తగా ఏర్పడిన అల్పపీడనం కదలికలు, దాని తీవ్రతను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

ఇదీ చదవండి: ఎన్నికల్లో ప్రముఖ జ్యోతిష్యుడి భార్య ఘోర ఓటమి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement