చంద్రబాబు అబద్ధాలపై బాధితుల మండిపాటు! | Mondha victims lash out at Chandrababu's lies | Sakshi
Sakshi News home page

చంద్రబాబు అబద్ధాలపై బాధితుల మండిపాటు!

Oct 29 2026 8:06 PM | Updated on Oct 29 2026 8:35 PM

Mondha victims lash out at Chandrababu's lies

విజయవాడ: తాను చేయనిది చేశానంటూ నిత్యం అబద్ధాలు వల్లెవేసే చంద్రబాబు.. మరో అబద్ధాన్ని కూడా అలవోకగా నమ్మించే యత్నం చేశారు. గతేడాది వచ్చిన మొంధా తుపాన్‌కు నష్ట పరిహారం ఇవ్వకుండానే ఇచ్చేశామంటూ అబద్ధం చెప్పేశారు. అది కూడా అర్నబ్‌ తుపాన్‌ సాక్షిగా ఆయన అబద్ధం ఆడేశారు. గతేడాది తుపాన్‌ నష్ట పరిహారం ఇవ్వలేదని బాధితులకు తెలిసినా వారినే బురిడీ కొట్టించే యత్నం చేశారు. 

మొంధా తుపాన్‌ కారణంగా ఒక్క రూపాయి పరిహారం ఇవ్వకుండా రైతులకు ఎగనామం పెట్టిన చంద్రబాబు.. తాజాగా అర్నబ్‌ తుపాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సందర్భంలో ‘మొంధా తుపాన్‌ పరిహారం ఇచ్చేశాం’ అనే వ్యాఖ్యలు చేశారు. ఇది విన్న బాధితులు.. ‘పరిహారం ఎప్పుడు వచ్చింది.. ఎక్కడ వచ్చింది?’ అని ముక్కున వేలేసుకుంటున్నారు. 

ఇదే విషయాన్ని మీడియా ప్రశ్నించగా, ‘ఇచ్చేశాం’ అంటూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించారు చంద్రబాబు. అదే సమయంలో ఏవో లెక్కలు కూడా చెప్పేశారు. కేవలం జీవోలకు మాత్రమే పరిమితమైన నష్ట పరిహారాన్ని, బాధితుల ఖాతాలో వేసే యత్నం చేశారు. గతేడేది ఇవే రోజుల్లో వచ్చిన మొంధా తుపాన్‌ కారణంగాగా రూ. 411 కోట్ల నష్టం వాటిల్లినట్లు అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది. అయితే బాధిత అన్నదాతలకు మాత్రం పరిహారం ఇప్పటికీ అందలేదు. ఏడాదైనా రైతులకు పరిహారం ఇవ్వకుండా ఎగ్గొట్టే యత్నం చేస్తున్నారు.  ఇప్పుడు ఆ పరిహారం ఇచ్చేశామని చంద్రబాబు చెబుతుండటంపై బాధితులు మండిపడుతున్నారు. ఆ పరిహారం ఎలాగూ రాలేదు.. ఇప్పుడైనా వస్తుందో.. లేదో అనే ఆందోళనలో ఉన్నారు.

ఇదీ చదవండి:  సైకిల్‌ను తుక్కు తుక్కుగా ఓడించాలి: ఆర్కే రోజా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement