తుపాన్‌ బాధిత ప్రజలకు తోడుగా నిలవండి.. | YS Jagan Holds Video Conference with YSRCP Leaders | Sakshi
Sakshi News home page

తుపాన్‌ బాధిత ప్రజలకు తోడుగా నిలవండి..

Oct 29 2026 5:10 PM | Updated on Oct 29 2026 5:57 PM

YS Jagan Holds Video Conference with YSRCP Leaders

సాక్షి,తాడేపల్లి: అర్నబ్‌ తుపాన్‌ బాధిత ప్రాంతాల్లో ప్రజలకు తోడుగా నిలవాలని పార్టీ శ్రేణులకు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలతో వైఎస్‌ జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో పార్టీ జిల్లా అధ్యక్షులు, రీజనల్‌ కో-ఆర్టినేటర్లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ..‘గ్రామ, వార్డు సచివాలయాల నిర్వీర్యం, వాలంటీర్ల వ్యవస్థ రద్దు తుపాను సహాయక చర్యలపై ప్రస్పుటంగా కనిపించింది. విపత్తులను ఆదాయ వనరుగా మార్చుకోవాలనుకుంటున్నారు. ఇప్పటికే బియ్యం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సోనా మసూరి బియ్యం కేజీ రూ.90 దాటింది

మంత్రి పయ్యావుల వియ్యంకుడు సహా టీడీపీ నేతలు బియ్యాన్ని మార్కెట్లోకి రానీయకుండా బ్లాక్‌చేసి, ఎక్స్‌పోర్టు చేస్తున్నారు. విపత్కర పరిస్థితుల్లోనూ బియ్యం మాఫియాను ప్రోత్సహిస్తున్నారు. తుపాను కారణంగా వరి, ఆక్వా, పండ్ల తోటలు బాగా దెబ్బతిన్నాయి. తుపాను బాధిత ప్రాంతాల్లో ప్రజలకు తోడుగా నిలవండి. ధాన్యం సేకరణ సమయంలోనూ రైతులకు మద్దతుగా నిలవండి. ప్రతి గింజనూ ప్రభుత్వం సేకరించేలా ఒత్తిడి తేవాలని’ వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు. 

తుపాన్‌ బాధిత ప్రజలకు తోడుగా నిలవండి..

ఇదీ చదవండి : నేడు వైఎస్సార్‌సీపీ నేతలతో వైఎస్‌ జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement