breaking news
Cyclone Arnab
-
దూసుకొస్తున్న తుఫాన్.. ఏపీలో కుంభవృష్టి వర్షాలు..!
-
ఏపీకి బిగ్ అలర్ట్.. దూసుకొస్తున్న అతి తీవ్ర తుపాను
సాక్షి, విజయవాడ: తూర్పు మధ్య, ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం.. గడిచిన ఆరు గంటల్లో గంటకు ఐదు కి.మీ వేగంతో కదులుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఇది ప్రస్తుతానికి విశాఖపట్నంకు 880 కి.మీ, కాకినాడకు 980 కి.మీ, మచిలీపట్నంకు 1080 కి.మీ.,బాపట్లకు 1150 కి.మీ.దూరంలో కేంద్రీకృతమైంది.ఇవాళ(ఆదివారం) తీవ్ర వాయుగుండం, రేపు(సోమవారం) తుపాన్‌గా బలపడే అవకాశముంది. ఎల్లుండి(మంగళవారం) ఉదయం నాటికి పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా బలపడే అవకాశం ఉంది. బుధవారం ఉదయానికి అతి తీవ్ర తుపానుగా బలపడే సూచనలు కనిపిస్తున్నాయి. మధ్యాహ్ననికి బాపట్ల-విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో గంటకు 115-125 కి.మీ గరిష్టంగా 140 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని.. ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు.నేటి నుంచి ఐదు రోజుల పాటు ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ పేర్కొంది. 27, 28 తేదీల్లో అత్యంత భారీ వర్షాలు ఉండే అవకాశం ఉందని.. మత్స్యకారులు ఉన్నఫలంగా తీరానికి తిరిగి రావాలని ఐఎండీ హెచ్చరించింది. తుపాను తీరానికి దగ్గరయ్యే కొద్దీ గాలుల తీవ్రత అధికంగా ఉంటుందని ఐఎండీ అంచనా వేసింది.ఇదీ చదవండి: నామినేషన్లలో ‘పచ్చ’ నకిలీలు


