అర్నబ్‌ తుపాను విధ్వంసం.. తెలంగాణ సహాయం కోరిన ఏపీ | Cyclone Arnab Destroyed Electricity Dept: AP Ask Telangana Help | Sakshi
Sakshi News home page

మ్యాన్‌ పవర్‌ కోరిన ఆంధ్రప్రదేశ్‌

Oct 29 2026 3:08 PM | Updated on Oct 29 2026 3:22 PM

Cyclone Arnab Destroyed Electricity Dept: AP Ask Telangana Help

అర్నబ్‌ తుపానుతో దెబ్బతిన్న విద్యుత్‌ వ్యవస్థ

హన్మకొండ: అర్నబ్‌ తుపాను వల్ల ఏపీ రాష్ట్రం అతలాకుతలమవుతోందని, రాష్ట్రంలో విద్యుత్‌ వ్యవస్థకు భారీనష్టం వాటిల్లిందని, వ్యవస్థను పునరుద్ధరించడానికి మ్యాన్‌పవర్‌ సహాయం చేయవలసిందిగా ఆ రాష్ట్ర విద్యుత్‌సంస్థలు తెలంగాణ రాష్ట్రాన్ని సాయం కోరాయి. టీజీ ఎన్పీడీసీ ఎల్‌లో రిజిస్టర్‌ అయిన కాంట్రాక్ట్‌ ఏజెన్సీల నుంచి 200 బృందాలను (ఒక్కో బృందంలో పదిమంది ఉంటారు) పంపాల్సిందిగా మనవి చేశాయి. అయితే అర్నబ్‌ తుపాను తెలంగాణ రాష్ట్రంలోనూ తీవ్రమైన ప్రభావం చూపనుండడంతో పరిస్థితులను బట్టి ఆలోచిస్తామని తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ సంస్థలు తెలిపాయి.

రాష్ట్రంలో ప్రధానంగా టీజీ ఎన్పీడీసీఎల్‌ పరిధిలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లో అర్నబ్‌ తుపాను తీవ్ర ప్రభావం చూపనుందని వాతావరణ శాఖ తెలిపింది. హనుమకొండ, వరంగల్‌తోపాటు గోదావరి నది తీర ప్రాంతాల్లో కూడా తుపాను ప్రభావం ఉండనుందని ఎన్పీడీసీఎల్‌ యాజమాన్యం భావిస్తోంది. దీంతో ఏపీకి మ్యాన్‌పవర్‌ పంపడం సాధ్యం కాదని చెప్పినట్లు సమాచారం. కనీసం 100 టీమ్‌లనైనా పంపాలని కోరగా ఇక్కడి పరిస్థితులను బట్టి ఆలోచిస్తామని విద్యుత్‌ సంస్థలు తెలిపాయి.

అర్నబ్‌ అలజడిలో విద్యుత్‌ వ్యవస్థ 
ఖమ్మం, కొత్తగూడెం, ములుగు జిల్లాలపై ప్రత్యేక దృష్టి

సాక్షి, హైదరాబాద్‌: అర్నబ్‌ తుపాను నేపథ్యంలో విద్యుత్‌ శాఖ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లో విద్యుత్‌ వ్యవస్థపై తుపాను ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంచనా వేశారు. తెలంగాణ ఉత్తర ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ అధికారులు క్షేత్రస్థాయి సిబ్బందిని అప్రమత్తం చేశారు. 

విద్యుత్‌ స్తంభాలు నేలకొరగడం, చెట్లు విరిగి తీగలపై పడటం, విద్యుత్‌ లైన్లు తెగిపోవడం, ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతినడం వంటి సమస్యలు తలెత్తే ప్రాంతాలను ముందే గుర్తించారు. ఉరుములు, మెరుపులతో ఫీడర్లు ట్రిప్‌ కావడం వల్ల కొన్ని ప్రాంతాల్లో సరఫరా నిలిచి పోయే ప్రమా దం ఉందని భావిస్తున్నారు. దీంతో విద్యుత్‌ సిబ్బంది సెలవులు రద్దు చేశారు. పట్టణ ప్రాంతాల్లో సిబ్బందిని కూడా మారుమూల ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశించారు. 

ఇదీ చ‌ద‌వండి: ఏపీకి పొంచివున్న మరో ముప్పు..

తుపాను ప్రభావంతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయాలు ఏర్పడకుండా అవసర మైన చర్యలు చేపట్టినట్టు ఎన్పీడీసీఎల్‌ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి తెలిపారు. 11 సర్కిళ్ల సూపరింటెండెంట్‌ ఇంజనీర్లతో సమీక్షించారు. వివిధ ప్రాంతాల నుంచి పది మొబైల్‌ రిస్టోర్‌ వాహనాలను తుపాను ప్రభావం ఉండే ప్రాంతాలకు పంపినట్టు అధికారులు చెప్పారు. మరోవైపు విద్యుత్‌ గ్రిడ్‌ను అధికారులు పరిశీలిస్తున్నారు. థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి జరిగే ప్రాంతాల్లో నెట్‌వర్క్‌కు ఇబ్బంది లేకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement