చంద్రబాబు సర్కార్‌ అధికార దుర్వినియోగం: ఎస్వీ సతీష్‌రెడ్డి | SV Sathish Reddy Fires On Chandrababu And Nara Lokesh For Misusing Power, Raises Concerns Over Public Safety And Election Fairness | Sakshi
Sakshi News home page

చంద్రబాబు సర్కార్‌ అధికార దుర్వినియోగం: ఎస్వీ సతీష్‌రెడ్డి

Oct 29 2026 12:56 PM | Updated on Oct 29 2026 1:40 PM

Sv Sathish Reddy Fires On Chandrababu And Nara Lokesh

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: కూటమి సర్కార్‌ అధికారం దుర్వినియోగం చేస్తోందని.. ఇలానే కొనసాగితే రాష్ట్రంలో  ప్రజల ఆస్తి, మాన ప్రాణాలకు ముప్పు అంటూ వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ రెడ్డి మండిపడ్డారు. వేంపల్లి ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు చేసి జడ్పీటీసీ ఎన్నికల ప్రచారాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు మీడియా సమావేశాలు చూస్తే అసహ్యం వేస్తోందన్నారు.

‘‘ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారు. చంద్రబాబు వ్యక్తిగత విమర్శలకు దిగడం దుర్మార్గం. రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను ప్రజలు గమనించాలి. ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారు.

..రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.  ప్రజా సమస్యలను పక్కనపెట్టి వైఎస్‌ జగన్‌ కుటుంబ విషయాలు మాట్లాడే స్థాయికి చంద్రబాబు దిగజారారు. అహంకారం, నియంతృత్వ ధోరణితో లోకేష్ పాలిస్తుంటే చంద్రబాబు కళ్లు లేని కబోదిలా చూస్తున్నారు. ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేలా అధికారులు.. ప్రజలకు సహకరించాలని సతీష్ రెడ్డి కోరారు.

ఇదీ చదవండి: తిరుపతిలో వైఎస్సార్‌సీపీ నిరసన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement