భర్తకు బీఫామ్‌.. స్వతంత్రంగా భార్య! | Wife And Husband Contest In Local Body Election | Sakshi
Sakshi News home page

భర్తకు బీఫామ్‌.. స్వతంత్రంగా భార్య!

Oct 29 2026 12:50 PM | Updated on Oct 29 2026 1:18 PM

Wife And Husband Contest In Local Body Election

జెడ్పీటీసీ అభ్యర్థులుగా భార్యాభర్తల పోటీ 

రామచంద్రాపురం(తిరుపతి): టీడీపీలో అంతర్గత విబేధాలు ఏకంగా పార్టీ మండల అధ్యక్షుడి ఇంట్లోనే కుంపటి రాజేశాయి. ఈ ‘ఇంటి పోరు’ జిల్లా రాజకీయాల్లో కలకలం రేపుతోంది. భార్యాభర్తలు జెడ్పీటీసీ అభ్యర్థులుగా పోటీకి దిగడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. 

భర్తకు బీఫామ్‌.. స్వతంత్రంగా భార్య! 
టీడీపీ మండల అధ్యక్షుడు మేకల తిరుమల రెడ్డి జెడ్పీటీసీ అభ్యర్థిగా అధికారికంగా బీఫామ్‌ అందుకొని బరిలో నిలిచారు. అయితే ఆయన సతీమణి మేకల మాధవి కూడా అదే స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ వేసి పోటీ పడుతున్నారు. మండల స్థాయిలో పార్టీని నడిపించాల్సిన వ్యక్తి ఇంట్లోనే  ముసలం పుట్టడంతో కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు. ఈ పోరు చివరకు పార్టీ పరువును వీధికి ఈడ్చిందని స్థానిక నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు.  

ఇదీ చదవండి: శ్రీలంక పౌరురాలికి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ టికెట్టా?


 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement