అభ్యర్థి ఎంపికకు టాస్‌.. తిరుపతి జిల్లాలో వింత రాజకీయం! | TDP Picks Anupalle MPTC Candidate Through Coin Toss In Tirupati District After Five Aspirants Vie For Ticket | Sakshi
Sakshi News home page

అభ్యర్థి ఎంపికకు టాస్‌.. తిరుపతి జిల్లాలో వింత రాజకీయం!

Oct 29 2026 1:04 PM | Updated on Oct 29 2026 1:23 PM

TDP Candidate Selected Through Coin Toss Tirupati District

ఎంపీటీసీ అభ్యర్థి కౌసల్య

రామచంద్రాపురం(తిరుపతి): ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అంటేనే ప్రచార హోరు, వ్యూహాలు, ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం వంటివి ఉంటాయి. కానీ, తిరుపతి జిల్లాలో మాత్రం నాయకులు సరికొత్త ట్రెండ్‌కు తెరతీశారు. గెలుపోటములను ఓటర్ల తీర్పు కంటే.. అదృష్ట దేవత ఎవరిని కరుణిస్తుందనే దానిపై ఆధారపడేలా చేయడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. ఓ ఎంపీటీసీ స్థానాన్ని నాణెం నిర్ణయించడంతో కూటమిలో ఇరువర్గాల మధ్య పోటీ లేకుండా, పార్టీ పెద్దల సమక్షంలో  విచిత్ర రాజకీయ డ్రామా జరిగింది. 

వివరాలు.. రామచంద్రాపురం మండలం అనుపల్లె టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి ఎంపిక కోసం పార్టీ నాయకులు  తర్జనభర్జన పడ్డారు. మంగళవారం జరిగిన తుది జాబితా ప్రక్రియలో ఇరువురు అభ్యర్థులను ఒప్పించేందుకు నాయకులు తలలు పట్టుకున్నారు. ఈ స్థానం కోసం ఏకంగా ఐదుగురు ఆశావహులు నామినేషన్లు వేయడంతో గందరగోళం ఏర్పడింది. అయితే, పార్టీ పెద్దల జోక్యంతో ముగ్గురు తప్పుకోవడంతో బరిలో కుమ్మర కౌసల్య, జిల్లా సౌందర్య మాత్రమే మిగిలారు. 

సాధారణంగా కూటమి రాజకీయాల్లో టికెట్ల కేటాయింపుపై సుదీర్ఘ చర్చలు, సర్వేలు జరుగుతాయి. కానీ, ఇక్కడ ఇరువర్గాల మధ్య గట్టి పోటీ ఉండటంతో, పార్టీ పెద్దలు ఒక ప్లాన్‌ వేశారు. అదే ఓటర్ల వద్దకు వెళ్లకుండానే నేరుగా బొమ్మా బొరుసు ఆట ఆడించారు. ఎవరి బలం, ఏరియా పట్టు వంటి కనీస అర్హతలను పక్కన పెట్టి.. పెద్దల ఆధ్వర్యంలో గాలిలో నాణెం వేశారు. అది కాస్తా బొమ్మ పడడంతో కుమ్మర కౌసల్యను అభ్యర్థిగా ఖరారు చేశారు. ఎమ్మెల్యే పులివర్తి నాని స్వయంగా ఆమెకు బీఫారమ్‌ అందజేశారు.   

ఇదీ చదవండి: భర్తకు బీఫామ్‌.. స్వతంత్రంగా భార్య!


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement